Dsc Exams 2024 Dates: తెలంగాణలో 11,062 టీచర్ల ఖాళీలు భర్తీ చేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలున్నా సరే డీఎస్సీ పరీక్షల నిర్వహణ ప్రక్రియ ఆగకుండా కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా పరీక్షల తేదీలు కూడా ప్రకటించింది ప్రభుత్వం.
ప్రస్తుతం తెలంగాణలో డీఎస్సీ పరీక్షలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వాస్తవానికి ఇవాళ్టితో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియాల్సి ఉండగా తెలంగాణ విద్యాశాఖ పొడిగించింది. ఇప్పుడిక జూన్ 20 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. 1000 రూపాయలు ఫీజు చెల్లించి జూన్ 20 వరకూ డీఎస్సీ పరీక్షలకు అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వం ప్రకటించిన 11,062 ఖాళీల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కాగా 6,508 ఎస్జీటీ పోస్టులున్నాయి. ఇక లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 727 ఉంటే పీఈటీలు 182 ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220 ఉన్నాయి. ఎస్జీటీ 796 ఉన్నాయి.
తెలంగాణలో జిల్లాల వారీగా ఖాళీలు పరిశీలిస్తే హైదరాబాద్‌లో అత్యదికంగా 878 ఉంటే, నల్గొండలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మంలో 757, సంగారెడ్డిలో 551, కామారెడ్డిలో 506 ఖాళీలున్నాయి. ఏపీలో కూడా 6100 ఖాళీల భర్తీకు ఫిబ్రరి నెలలోనే నోటిఫికేషన్ వెలువడింది. అప్లికేషన్ల స్వీకరణ కూడా ముగిసింది. ఇక మిగిలింది పరీక్షా కేంద్రాల వెబ్ ఆప్షన్ల ఎంపిక, హాల్ టికెట్ల విడుదల జరగాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారి వాయిదా పడింది.
తెలంగాణలో డీఎస్సీ పరీక్షల అప్లికేషన్ల ప్రక్రియ జూన్ 20 వరకూ కొనసాగుతుంది. జూలై 17 నుంచి 31వ తేదీవరకూ ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.
Also read: BRS Party Agenda: బీఆర్ఎస్ పార్టీ తగ్గేదేలే.. ఎన్నికలపై గులాబీ దళం భారీ వ్యూహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook