Telangana DSC: తెలంగాణలోని 2008 డీఎస్సీ అభ్యర్ధులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. మొత్తం 1382 మందికి సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. అయితే ఈ ఎస్జీటీ నియామకాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరిగాయి.
2008 డీఎస్సీ అభ్యర్ధులు 17 ఏళ్ల నుంచి ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నారు. న్యాయ పోరాటానికి దిగారు. ఈ బాధితులందరికీ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని గతంలోనే తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా ఇప్పటి వరకూ జాప్యం జరుగుతూ వచ్చింది. దాంతో మరోసారి కోర్టును ఆశ్రయించగా సంబంధిత అధికారులు, ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా పాటించరా అంటూ ప్రశ్నించింది. ఏళ్లతరబడి నియామకాల కోసం ఎదురు చూస్తుంటే కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు అమలు చేయరని ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్ధులకు శుభవార్త అందిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 1382 మంది 2008 నాటి డీఎస్సీ అభ్యర్ధులకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించింది. వీరికి నెలకు 31,040 రూపాయలు వేతనం ఉంటుంది. ఇక ఇతర ప్రయోజనాలు ఏమీ ఉండవు. ఉద్యోగంలో చేరిన తరువాత ఎప్పటికప్పుడు ప్రతి విద్యా సంవత్సరంలో కాంట్రాక్ట్ రెన్యువల్ అవుతుంది.
Also read: Water Disruption: హైదరాబాద్‌వాసులకు బిగ్ అలెర్ట్.. ఈనెల 17న నీటిసరఫరా బంద్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి