Yadadri Temple: యాదాద్రికి మరింత వైభవం.. తిరుమల స్థాయిలో భారీ ప్రణాళికలు

Telangana Govt Focused On Temples: తెలంగాణలోని యాదాద్రి ఆలయాన్ని తిరుమల స్థాయిలో నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రామప్పతోపాటు కీసర ఆలయంపై కూడా దృష్టి సారించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 31, 2024, 12:30 AM IST
Yadadri Temple: యాదాద్రికి మరింత వైభవం.. తిరుమల స్థాయిలో భారీ ప్రణాళికలు

Telangana Temples: తెలంగాణ ఇలవేల్పుగా కొలిచే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి మరింత వన్నె రానుంది. ఇప్పటికే పునఃనిర్మాణంతో ఆలయం కొత్త శోభ సంతరించుకోగా మరికొన్ని పనులు జరగాల్సి ఉంది. కొండపైన.. కింది భాగంలో మరిన్ని అభివృద్ధి పనులు జరగాల్సి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం వాటిపై దృష్టి సారించింది. తిరుమల స్థాయిలో రూపుదిద్దేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దేవాలయాల అభివృద్ధిపై హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోనే ప్రసిద్ధ క్షేత్రమైన యాదాద్రి ఆలయంపై చర్చించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదాద్రి ఆలయ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అచ్చంగా టీటీడీ అనుసరించిన తరహాలోనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి, విధి విధానాలు ఉండేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలని అధికారులకు చెప్పారు. యాదాద్రి ఆలయ రాజ గోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించాలన్నారు.

స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (స్పీడ్‌) ప్రాజెక్టుల్లో భాగంగా దేవాలయాల అభివృద్ధిపై ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు చాలా వరకు ఆగిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. పనులు ఆగిపోవడానికి వీల్లేదని.. ఇప్పటివరకు ఏమేం అభివృద్ధి పనులు జరిగాయి.. ఇంకా ఏమేం అసంపూర్తిగా ఉన్నాయనే వివరాలతో వారం రోజుల్లో సమగ్ర నివేదికను అందించాలని సీఎం ఆదేశించారు.

కీసరకు పూర్వదశ
ఇక హైదరాబాద్‌ శివారులోని కీసర గుట్టపై ఉన్న రామలింగేశ్వర ఆలయంపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఈ ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించాలని నిర్ణయించారు. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రతిరూపంగా అచ్చం అదే నమూనాతో కీసరగుట్ట ఆలయాన్ని నిర్మించాలని చెప్పారు. ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీతో రామప్ప ఆలయ ఆకృతిలో యథాతథంగా కీసర ఆలయం పునర్మిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News