High Alert: పొంచి ఉన్న భారీ వర్షాల ముప్పు.. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt High Alert On Heavy Rainfall: ఎడతెరపి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయ చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాలని ఆదేశించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 31, 2024, 11:21 PM IST
High Alert: పొంచి ఉన్న భారీ వర్షాల ముప్పు.. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం

High Alert On Heavy Rainfall: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. లోతట్టు ప్రాంతాలు.. వరదలు.. ట్రాఫిక్‌ అంతరాయం.. విద్యుత్‌ సమస్యలు వంటి అంశాలపై సంబంధిత శాఖ అధికారులను తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి వెంటనే సహాయ చర్యల్లో పాల్గొనాలని ప్రభుత్వం సూచించింది.

Also Read: Telangana Rains: తెలంగాణకు భారీ ముప్పు.. మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

 

అన్ని ప్ర‌భుత్వ విభాగాల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారితో  రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తుండడంతో రెవెన్యూ, మున్సిప‌ల్‌, విద్యుత్‌, వైద్యారోగ్య శాఖాధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండేలా చూడాల‌ని సీఎస్‌కు సీఎం సూచించారు.

Also Read: Bandi Sanjay Offer: గణేశ్‌ మండపాల నిర్వాహకులకు బండి సంజయ్‌ బంపర్‌ ఆఫర్‌

 

ఎక్క‌డా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా చూడాల‌ని.. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క శిబిరాల‌కు త‌ర‌లించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. రిజ‌ర్వాయ‌ర్ల గేట్లు ఎత్తుతున్న దిగువ ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని చెప్పారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డీజీపీ జితేంద‌ర్‌తో కలిసి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, పోలీసు క‌మిష‌న‌ర్లు, కార్పొరేష‌న్‌, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. క్షేత్ర స్థాయి ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టికప్పుడు స‌మీక్షిస్తూ త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్ని జిల్లాల అధికార యంత్రాంగానికి ఆదేశించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్ష సూచనలు ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ మరో మూడు రోజులు వర్షాలు ఉంటాయని ప్రకటించింది. కొన్ని జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ కూడా జారీ చేసింది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో భారీ వర్షం ముప్పు ఉందనే విషయాన్ని తెలిపింది. శనివారం రోజు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం మరో రెండు రోజులు కూడా ఇదే తీరున కొనసాగుతుందని వెల్లడించింది. వాతావరణ శాఖ సూచనలతో ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు చేపట్టింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News