తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం (Telangana Govt scraps VRO system) తీసుకుంది. తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కార్ కసరత్తు చేస్తున్నారు. నేటి మధ్యాహ్నమే రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వోల నుంచి రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుండి అన్నిరకాల రిజిస్ట్రేషన్స్ నిలిపివేయాలని (Telangana Vro System Cancel) తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. TRS: కరోనాతో మరో టీఆర్ఎస్ నేత మృతి
మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులు స్వాధీనం ప్రక్రియ జరిగి పోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ రికార్డుల స్వాధీనం అంశాన్ని వేగవంతం చేశారు. నేటి సాయంత్రం 5 గంటల కల్లా రిపోర్టుల స్వాధీనంపై రిపోర్ట్ పంపాలని సైతం అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. SRH IPL 2020 Schedule: సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 షెడ్యూల్ పూర్తి వివరాలు
నేడు మొదలైన శాసనసభ సమావేశాల్లో రెవెన్యూ చట్టానికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టే పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మార్వోల అధికార దుర్వినియోగం, భారీ అవినీతి, ఎమ్మార్వోల సజీవ దహనం లాంటి ఘటనలతో తెలంగాణ సర్కార్ సరికొత్త రెవెన్యూ చట్టం దిశగా సాగుతోంది. Isha Koppikar Photos: ‘చంద్రలేఖ’ నటి గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూడండి
Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు