Telangana MLC Elections: తీన్మార్ మల్లన్నగా మరోసారి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన అధికారిక అభ్యర్థిగా ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని చెప్పినట్లు సమాచారం. 2021 మార్చిలో జరిగిన నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న 1.49 లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి కేవలం 12 వేల 806 ఓట్ల ఆధిక్యంతో తీన్మార్ మల్లన్నపై గెలిచారు.
తొలుత ఇదే నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన తీన్మార్ మల్లన్న కేవలం 13 వేల 33 ఓట్లకే పరిమితమయ్యారు. ఆరేండ్ల వ్యవధిలో ఆయన బలం పెంచుకుని 1.49 లక్షల ఓట్లు పొందగలిగారు. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలు, నిరుద్యోగ సమస్యలను ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకుని సొంతంగా పెట్టుకున్న యూట్యూబ్ ఛానెల్ ద్వారా తీన్మార్ మల్లన్న బాగా పాపులర్ అయ్యారు. ఇక తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు కీలకంగా మారాయి. ఈ మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
నవంబరు చివర్లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు తీసుకుని పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు తీన్మార్ మల్లన్న. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడే కలిసి ముచ్చటించారు. ఇంతకాలం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. త్వరలో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. దాంతో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న బరిలో దిగబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
Also Read: Washing Machine Offers: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.3,990కే రియల్ మీ 8.5 Kg Top Load వాషింగ్ మెషిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter