Tomato Price Hike: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న టమాటా ధర... కిలో రూ.80...

Tomato Price Hike: టమాటా ధర ఒక్కసారిగా భారీగా పెరిగింది. రిటైల్ మార్కెట్లో కిలో టమాటా ఏకంగా రూ.80కి చేరింది. దీంతో సామాన్యులు టమాటా కొనాలంటేనే భయపడిపోతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 12:13 PM IST
  • చుక్కలు చూపిస్తున్న టమాటా ధర
  • కిలో ధర ఏకంగా రూ.80
  • పెరిగిన టమాటా ధరలపై సామాన్యుల గగ్గోలు
Tomato Price Hike: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న టమాటా ధర... కిలో రూ.80...

Tomato Price Hike: టమాటా ధర సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. కొద్ది నెలల క్రితం వరకు రూ.5-రూ.10 మాత్రమే పలికిన టమాటా ధర ఇప్పుడు ఏకంగా సెంచరీ మార్క్ దిశగా పరుగులు పెడుతోంది. హైదరాబాద్ సహా చాలా చోట్ల ప్రస్తుతం కిలో టమాటా ధర రూ.80కి చేరింది. రైతు బజార్లలో కిలో టమాటా రూ.60-రూ.80 వరకు విక్రయిస్తున్నారు. పెరిగిన ధరలపై సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు.

అకాల వర్షాలతో టమాటా సప్లై తగ్గిపోవడం... కొత్త పంట చేతికి రావడం ఆలస్యమవడం వల్లే టమాటా ధర పెరిగినట్లు చెబుతున్నారు. గత వారం హోల్ సేల్ మార్కెట్లో కిలో టమాటా కేవలం రూ.20-రూ.25 వరకు పలికింది. అలాంటిది.. శుక్రవారం (మే 13) ఏపీఎంసీ హోల్ మార్కెట్ యార్డులో కిలో టమాటా ధర రూ.40-50కి చేరింది. అంటే గత వారంతో పోలిస్తే ధర రెట్టింపయింది. 

హోల్ సేల్ మార్కెట్లో ధరలు పెరగడంతో రిటైల్ మార్కెట్లోనూ ధరలు భారీగా పెరిగాయి. రైతు బజార్లు, చిన్న చిన్న మార్కెట్లలో కిలో టమాటా ధర రూ.70-రూ.80కి చేరింది. కొద్దిరోజులు ఆగితే కొత్త పంట చేతికొస్తుందని.. అప్పుడు ధరలు తగ్గే అవకాశం ఉందని ఏపీఎంసీ ట్రేడర్స్ అభిప్రాయపడుతున్నారు. అప్పటిదాకా సామాన్యులపై టమాటా భారం తప్పకపోవచ్చు. 

సాధారణంగా చాలామంది ఏ కర్రీ అయినా సరే టమాటా తప్పనిసరిగా వాడుతుంటారు. పెరిగిన ధరలతో ఇప్పుడు టమాటా కొనాలంటేనే భయపడిపోతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మోత మోగిపోతున్నాయి. ఇలాంటి స్థితిలో టమాటా పైపైకి ఎగబాకడం సామాన్యులను కలవరపెడుతోంది.

Also Read: Bride Commits Suicide: ప్రాణం తీసుకున్న నవ వధువు..పెళ్లింట విషాదం..!

Also Read: Amit Shah Hyd Visit: అమిత్ షా జీ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి... కేంద్రమంత్రిని నిలదీసిన ఎమ్మెల్సీ కవిత   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News