Amit Shah: ఇవాళ చేవెళ్లలో 'విజయ సంకల్ప సభ'.. స్పెషల్ ఎట్రాక్షన్ గా అమిత్ షా..

Amit Shah in Hyderabad today: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణకు రానున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించే విజయ సంకల్ప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 23, 2023, 01:04 PM IST
Amit Shah: ఇవాళ చేవెళ్లలో 'విజయ సంకల్ప సభ'.. స్పెషల్ ఎట్రాక్షన్ గా అమిత్ షా..

Amit Shah- Vijaya Sankalpa Sabha: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ రంగారెడ్డి జిల్లాకు రానున్నారు. బీజీపీ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా చేవెళ్లలో నిర్వహించే విజయ సంకల్బ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా చేవెళ్లకు వెళతారు. రాత్రి 7 గంటలకు సభ ముగించుకుని దిల్లీకి తిరుగుపయనమవుతారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లును ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకులు పూర్తి చేశారు. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు వస్తారని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. అమిత్ షా పర్యటన దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే పలు మార్గాల్లో ఆంక్షలు విధించారు. 

అమిత్ షా టూర్ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయం మరోసారి వేడి ఎక్కనుంది. తెలంగాణకు చేవెళ్ల గడ్డ సెంటిమెంట్ అని.. అందుకే విజయ సంకల్ప సభను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఈ బహిరంగ సభ కోసం 12 కమిటీలు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని 2,789 పోలింగ్ బూత్ ల నుంచి కార్యకర్తలు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. దాదాపు లక్ష మంది హాజరవుతారని వారు అంచనా వేశారు. హైదరాబాద్ కు దగ్గరలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో నగరం నుంచి కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరువుతారని ఆశిస్తున్నారు. 

Also read: Vijaya Sankalpa Sabha: అమిత్ షా సభకు లక్ష మందితో జన సమీకరణ.. బండి సంజయ్ భారీ యాక్షన్ ప్లాన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News