హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడవెల్లి గ్రామన్ని దత్తత తీసుకొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఆ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం మంత్రి సతీసమేతంగా గుమ్మడవెల్లి చేరుకొని అక్కడ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఇతర సభ్యులతో గ్రామ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహం, అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో మంత్రి కిషన్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు మంజూరు చేసిన 40 లక్షల చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, నేడు జరిగిన సభ కేవలం పరిచయ సభ మాత్రమేనని, అభివృద్ధి అనేది అందరూ కలసి కూర్చొని చర్చించి గ్రామ అభివృద్ధిని చేయాలని కిషన్ రెడ్డి అన్నారు. జాతి పితా మహాత్మా గాంధీ కలగన్న గ్రామ స్వరాజ్యం దిశగా అభివృద్ధి చేయడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
గ్రామానికి చెందిన పెద్దలు మన గ్రామానికి ఏమేమి కావాలో రాజకీయాలు పార్టీలకతీతంగా కూర్చొని చర్చిస్తే అవి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని కిషన్ రెడ్డి తెలిపారు. అనంతరం గుమ్మడవెల్లి తండాకి వెళ్లిన కిషన్ రెడ్డి దంపతులకు గిరిజన లంబాడి మహిళలు సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గిరిజన తండాల్లో గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనం కిషన్ రెడ్డి చేశారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి గుమ్మడవెల్లి గ్రామంలో హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక నర్సరీని పరిశీలించారు. అనంతరం గుమ్మడవెల్లి కేంద్ర ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక ఉచిత హోమియో హెల్త్ క్యాంపు ప్రారంభించి, అక్కడ మొక్కలు నాటారు . అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఇదే గ్రామానికి చెందిన స్వచ్ఛ భారత్ ట్రాక్టర్ ను ప్రారంభించి సేంద్రియ ఎరువులు తయారీ కేంద్రాన్ని, వైకుంఠధామం దామాన్ని ప్రారంభించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..