Afghanistan: 'తాలిబన్లు..శవాలను కూడా రేప్ చేస్తారు'..అఫ్ఘన్‌ శరణార్థి సంచలన వ్యాఖ్యలు

Afghanistan: తాలిబన్ల గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. వారి దురాగాతాలు గురించి వింటుంటే..వారు ఇంత నరరూప రాక్షషులా అని అనిపించకమానదు. తాలిబన్ల శవాలపై కూడా అత్యాచారం చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేసింది భారత్ కు శరణార్థిగా వచ్చిన అప్ఘన్ మహిళ. వివరాల్లోకి వెళితే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 25, 2021, 02:54 PM IST
  • తాలిబన్లపై అఫ్ఘన్ శరణార్థి సంచలన వ్యాఖ్యలు
  • అప్ఘాన్ లో కొనసాగుతున్న తాలిబన్ల ఆరాచకాలు
  • మహిళలపై పెరుగుతున్న ఆంక్షలు
Afghanistan: 'తాలిబన్లు..శవాలను కూడా రేప్ చేస్తారు'..అఫ్ఘన్‌ శరణార్థి సంచలన వ్యాఖ్యలు

Afghanistan: తాలిబన్లు చేసే ఆరాచకాల గురించి రోజుకో వాస్తవం బయటపడుతోంది. తాజాగా తాలిబన్ల అరాచకాలు భరించే శక్తి తనకు లేదని, ఆ కారణంతోనే దేశం విడిచిపోయి వచ్చానని అఫ్గనిస్తాన్‌ (Afghanistan) చెందిన ఓ మహిళ అన్నారు. చనిపోయిన శవాలపై కూడా తాలిబన్లు అత్యాచారాలకు పాల్పడతారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారత్ కు శరణార్థిగా వచ్చిన ఓ అప్ఘన్ మహిళ(Afghan refugee) అక్కడ పరిస్థితులను గురించి వివరించారు. ఆమె మాట్లాడుతూ... ''ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో మహిళను పంపించాలని తాలిబన్‌ ఫైటర్లు కోరతారని... ఎవరైనా తమతో రావడానికి నిరాకరిస్తే కాల్చి చంపేస్తారని.. మృతదేహాలపై కూడా వాళ్లు లైంగికదాడికి పాల్పడతారని.. ఒక మనిషి బతికుందా లేదా చచ్చిపోయిందా అన్న విషయాలతో వాళ్లకు సంబంధం ఉండదని''..దీనిని బట్టి అక్కడ తమ పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవాలన్నారు. ప్రభుత్వానికి మద్దతుగా ఉద్యోగానికి వెళ్లే మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని...వారితో పాటు వారి కుటుంబాలు కూడా ప్రమాదంలో పడతాయి అని ఆమె అన్నారు. తాలిబన్ల వార్నింగ్లు ఇవ్వరని..వారి మాట వినకపోతే చంపేస్తారంటూ తాలిబన్ల ఆరాచకాలు గురించి ఆమె వివరించారు.

Also Read: CIA and Talibans: తాలిబన్లతో అమెరికా సీఐఏ రహస్య సమావేశం..రహస్య ఒప్పందమా

తమ తొలి మీడియా సమావేశంలో తాలిబన్లు(Taliban)..మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే కో ఎడ్యుకేషన్‌ రద్దు చేయడం, వేశ్యా గృహాల్లో జంతువులను ఉంచడం ద్వారా తమ వైఖరి ఏమిటో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా... అఫ్ఘానిస్థాన్‌(Afghanistan)లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు మహిళల(Women)పై ఆంక్షలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు(Women Employees) బయటకు రావొద్దని తాలిబన్లు హెచ్చరికలు జారీ చేశారు. భద్రతా సిబ్బంది అనుమతిస్తేనే బయటకు రావాలని ఆదేశించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News