అమెరికాలో ఏం జరుగుతోంది. త్వరలో ఆ దేశం ఆర్ధిక ఇబ్బందులకు గురి కానుందా..అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ చేసిన వ్యాఖ్యలు ఎందుకు ఆందోళన కల్గిస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి ఆందోళన కల్గిస్తోంది. ప్రపంచమంతా ఆర్ధిక మాంద్యంతో ఇబ్బంది పడుతున్న వేళ అమెరికాలో ఆ ప్రభావం ఉండదని భావించారు. కానీ ఇప్పుడు ఆ దేశంలో కూడా అదే ప్రభావం పడే పరిస్థితులు కన్పిస్తున్నాయి. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. బెజోస్ చేసిన వ్యాఖ్యలు ఆషామాషీగా చేసిన వ్యాఖ్యలు కావు. అమెరికాలో అంతటి ప్రమాదకర పరిస్థితులు వస్తున్నాయా అనే ఆందోళన కలుగుతోంది.
జెఫ్ బెజోస్ చెప్పిందేంటి
చేతిలో అందుబాటులో ఉన్న డబ్బును అనవసరంగా ఖర్చు చేయవద్దు. వచ్చే సెలవుల్లో ఎవరూ టీవీలు, ఫ్రిడ్జిలు కొనవద్దు. వినియోగదారులు నగదును భద్రంగా ఉంచుకోవాలి. సెలవుల సమయంలో అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. రాబోయే నెలల్లో అనవసరమైన ఖర్చులు నివారించుకోవాలి. ఖరీదైన వస్తువులు కొనకుండా పొదుపు పాటించాలి. అలా చేస్తేనే ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురైతే తట్టుకోగలుగుతారు. ఆర్ధిక వ్యవస్థ బాగా లేకపోవడంతో పలు కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి.
ఈ వ్యాఖ్యలేవీ ఆషామాషీగా చేసినట్టు కన్పించడం లేదు. అమెజాన్ వ్యవస్థాపకుడు చేసిన వ్యాఖ్యలు రానున్న కాలంలో ముంచుకొచ్చే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ప్రమాదకరంగా మారుతున్నాయి.
మరోవైపు తన ఆస్థిలో ఎక్కువ భాగాన్ని వాతావరణంలోని మార్పుల్ని ఎదుర్కోవడానికి, పెరుగుతున్న సామాజిక,రాజకీయ విభజనల మద్య మానవాళిని ఏకం చేసే స్వచ్ఛంద సంస్తలకు విరాళంగా ఇస్తున్నట్టు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ చెప్పారు.
Also read: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook