China: మరో చిన్న, నిరుపేద దేశంపై కన్నేసిన చైనా

చైనా విస్తరణ కాంక్ష ( China expansionism ) అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటివరకు పెద్ద దేశాలతోనే వివాదాలు పెట్టుకున్న చైనా.. ఇప్పుడు ఓ చిన్న, నిరుపేద దేశంపైన కన్నేసింది. ఇటీవల భారత్‌తో చైనా సరిహద్దు వివాదం తీవ్రస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. లఢఖ్‌లోని గల్వన్ లోయలో ఘర్షణ ( Galwan valley face off ) అనంతరం భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత వేడెక్కాయి.

Last Updated : Aug 7, 2020, 07:24 PM IST
  • చైనాకు మరింత పెరుగుతున్న విస్తరణ కాంక్ష ( China expansionism ).
  • పొరుగునే ఉన్న చిన్న, నిరుపేద దేశానికి చెందిన భూభాగంపై చైనా కన్ను.
  • చైనా అధికారిక మీడియాలో వస్తున్న కథనాలు చూసి చైనా నుంచి ఎప్పుడు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందా అని వణికిపోతున్న ఆ చిన్న దేశం.
China: మరో చిన్న, నిరుపేద దేశంపై కన్నేసిన చైనా

చైనా విస్తరణ కాంక్ష ( China expansionism ) అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటివరకు పెద్ద దేశాలతోనే వివాదాలు పెట్టుకున్న చైనా.. ఇప్పుడు ఓ చిన్న, నిరుపేద దేశంపైన కన్నేసింది. మధ్య ఆసియాలోని అతి చిన్న, పేద దేశాల్లో ఒకటైన తజికిస్తాన్ భూభాగంపై ( Tajikistan territory ) చైనా కన్ను పడింది. తజికిస్తాన్ భూభాగంలో ఉన్న పామిర్ పర్వతాలు ( Pamir mountains ) చైనాకి చెందినవేనని గత కొద్ది వారాలుగా చైనా ప్రభుత్వానికి చెందిన అధికారిక మీడియాలో వస్తోన్న కథనాలు చూసి తజికిస్తాన్ ఆందోళన చెందుతోంది. చో యావో లు అనే చైనాకు చెందిన చరిత్రకారుడు చైనా అందించిన సమాచారం ఆధారంగా అంటూ చైనా మీడియాలో ఓ వ్యాసాన్ని రాసుకొచ్చాడు. పామిర్ పర్వతాలన్నీ చైనాకు చెందినవేనని.. వాటిని తజికిస్తాన్ తిరిగిచ్చేయాలని చో యావో లు ఆ కథనంలో పేర్కొన్నాడు. Also read: Mystery Seeds: చైనా నుంచి విత్తనాల కొరియర్లు.. చైనా మరో కుట్ర చేస్తోందా ?

చైనా అధికారిక మీడియాలో వస్తున్న ఈ కథనాలు చూసి తజికిస్తాన్ సర్కార్ ( ( Tajikistan govt )  ఆందోళనలో పడింది. ఈ కథనాల తీవ్రతను రష్యా ( Russia ) సైతం ఓ కంట గమనిస్తోంది. చైనా చరిత్రకారుడు రాసిన కథనం ప్రకారం 1911లో కొత్తగా చైనా దేశం ఏర్పడినప్పుడు.. చైనాకు చెందిన భూభాగమంతా తిరిగిచ్చేయాల్సిందిగా కోరడం జరిగింది. కానీ అప్పట్లో కొన్ని దేశాలు చైనా భూభాగాలను తిరిగి ఇచ్చేయగా.. ఇంకొన్ని దేశాలు ఇప్పటికీ చైనా భూభాగాన్ని తమ ఆధీనంలోనే ఉంచుకున్నాయని.. పమిర్ పర్వతాలు కూడా అలా తజికిస్తాన్ ఆధీనంలో ఉన్నాయని చో లు అభిప్రాయపడ్డాడు. Also read: Bytedance: భారత్ దెబ్బకు విలవిలలాడుతున్న చైనా కంపెనీ 

ఇదిలావుంటే.. చైనా ( China ), తజకిస్తాన్ ( Tajikistan ) మధ్య భూభాగం తగదాలు ఇవాళ కొత్తవి కాదు. గతంలోనూ ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు తగాదాలు ఉండేవి. ఈ నేపథ్యంలోనే 2010లో చైనా, తజికిస్తాన్ సరిహద్దుల పంచాయతీ విషయంలో ఓ ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం తజకిస్తాన్ తమ దేశానికి చెందిన 1,158 చదరపు మీటర్ల స్థలాన్ని బలవంతంగానే చైనాకు ఇవ్వాల్సి వచ్చింది. కానీ తాజాగా చైనా వ్యవహరిస్తున్న తీరు చూస్తోంటే.. తజకిస్తాన్ పమిర్ పర్వతాలను మొత్తం తిరిగి ఇచ్చే వరకు ఊరుకునేటట్టు కనబడటం లేదు. Also read: రష్యా యుద్ధ విమానాలను అడ్డుకున్న మరో యుద్ధ విమానం

ఇటీవల భారత్‌తో చైనా సరిహద్దు వివాదం తీవ్రస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. లఢఖ్‌లోని గల్వన్ లోయలో ఘర్షణ ( Galwan valley face off ) అనంతరం భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత వేడెక్కాయి. Also read:  Dogs: కరోనావైరస్‌ను శునకాలు పసిగడతాయా ?

Trending News