Afghan Crisis:ఆఫ్ఘన్ డెడ్‌లైన్ సమీపిస్తోంది. గడువు సమీపించే కొద్దీ ఆఫ్ఘన్ పరిణామాలపై టెన్షన్ పెరుగుతోంది. ఆఫ్ఘన్ ప్రజలు దేశం విడిచి వెళ్లే ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నారు. మరోవైపు విమానాశ్రయాన్ని తాలిబన్లు దిగ్భంధిస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)నుంచి పశ్చిమ దళాల తరలింపుకు గడువు సమీపిస్తోంది.డెడ్‌లైన్‌కు మరో రెండ్రోజులే గడువు మిగలడంతో సర్వత్రా టెన్షన్ నెలకొంది.తాలిబన్లపై భయంతో దేశం విడిచి వెళ్లేందుకు ప్రజలు కాబూల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.ఈ క్రమంలో ప్రజలు విమానాశ్రయానికి చేరకుండా తాలిబన్లు అడ్డుకుంటున్నారు. అదనపు సిబ్బందిని మొహరించి..విమానాశ్రయానికి వెళ్లే మార్గాల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఆఫ్ఘన్ సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాల్లో తాలిబన్లు(Talibans)పహారా చేస్తున్నారు.అమెరికన్ బలగాలు(American Military) వైదొలగిన వెంటనే మొత్తం కాబూల్ విమానాశ్రయాన్ని(Kabul Airport) స్వాధీనం చేసుకోనున్నారు. విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్ని తాలిబన్లు దిగ్భంధించడంతో విమానాశ్రయం వెలుపల జనం రద్దీ పరిస్థితుల్లేవు. విమానాశ్రయానికి వచ్చే రోడ్లపై వార్నింగ్ షాట్లు పేల్చారు. స్మోక్ బాంబుల్ని ప్రయోగించారు.
మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌లో ఆర్ధిక సంక్షోభం (Financial Crisis in Afghanistan)నెలకొందని తెలుస్తోంది. విదేశాల్నించి వస్తున్న సహాయం నిలిచిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.ఉద్యోగులు, సామాన్య ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ కడుతున్నారు. ఏటీఎంలలో విత్‌డ్రా పరిమితిని తగ్గించేశారు. తాలిబన్లు అందర్నీ కలుపుకుంటూ వెళ్తూ..ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తేనే ఆఫ్ఘన్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి రావచ్చనేది ఓ అంచనా. లేకపోతే భవిష్యత్‌లో పరిస్థితి మరింతగా దిగజారవచ్చని సమాచారం.
Also read: America-China Talks: ఆఫ్ఘన్ పరిణామాలపై దృష్టి పెట్టిన అమెరికా-చైనా సైనిక ప్రతినిధులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook