ప్రళయ అలలకు నిలయంగా మారిన ఇండోనేషియాకు మరో సునామీ గండం వచ్చింది. ఇప్పటికే పెను విధ్వంసం సృష్టించి వందల మంది ప్రాణాలను బలితీసుకున్న సునామీ... ఇండోనేషియాపై ఇంకా కనికరం చూపినట్లుగా లేదు..మరో మారు విరుచుకుపడేందుకు సిద్ధమౌంది. మరో మారు అగ్ని పర్వాతాలు పేలి సునామీ వచ్చే అవకాశముందని స్థానిక తుపాను హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తుంది. ప్రస్తుతం తీర ప్రాంతంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నారు. పలుచోట్ల రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో తీర ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు. సునామీ హెచ్చరికలుతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇండోనేషియా వాసులు పరుగులు పెడుతున్నారు
రోజు రోజుకు పెరుగుతున్న మతుల సంఖ్య
ఇండోనేషియాలో సంభవించిన సునామీ బీభత్సవం వల్ల రోజు రోజుకు మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకు 490 మంది చనిపోయినట్లుగా అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటున్నారు. సునామీ కారణంగా 1600 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా 150 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉంది. మృతుల్లో విదేశీ టూరిస్టులే ఉండటం గమనార్హం. ఇటీవలె ఇండోనేషియాలోని టాంగ్జింగ్ దీవుల్లో పర్వాతాలు పేలి సంభవించిన సునామీ బీభత్సవం వల్ల ఈ మేరకు నష్టం వాటిల్లింది . ఇప్పటికే తీవ్ర నష్టాన్ని చవిచూసిన ఇండోనేషియా వాసులకు మరోమారు సునామీ గండం వార్త విని భయభ్రాంతులకు గురౌతున్నారు.