మాడ్రిడ్: ప్రాణాంతక కరోనా వైరస్ (Coronavirus) బాధితుల జాబితాలో స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ భార్య బెగోనా గోమెజ్ చేరిపోయారు. ఇటీవల కెనడా ప్రధాని భార్య సైతం కోవిడ్19 (COVID-19) బారిన పడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోవిడ్19 పరీక్షలు జరపగా బెగోనా గోమెజ్‌కు పాజిటీవ్ అని తేలింది. ఆదివారం ఈ టెస్ట్ ఫలితాలను స్పానిష్ వార్తా సంస్థ యూరోపా ప్రెస్ వెల్లడించినట్లు స్ఫూత్నిక్ పేర్కొంది.
Read also : ఆ తప్పిదంతోనే భారత్‌లో తొలి కరోనా మరణం!
స్పెయిన్‌లో ఇప్పటివరకూ 6250 కోవిడ్10 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అందులో 193 మంది మృత్యువాత పడ్డారు. ప్రధాని సాంచెజ్ లాక్ డౌన్ విధించిన తర్వాత దేశ ప్రజలు ఆహారం, మెడిసిన్ కోసం తప్ప ఇతరత్రా పనుల కోసం బయటకు రావడం లేదన్నది తెలిసిందే.
See Photos: అందమైన భామలు.. లేత మెరుపు తీగలు
దేశంలోని అన్ని రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లు, అనవసరమైన రిటైల్ అవుట్లెట్లు, విద్యా సంస్థల్ని మూసివేయాలని ప్రధాని శాంచేజ్ ఆదేశించారు. రేపటి (సోమవారం) నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుందని ఆర్టీ రిపోర్ట్ చేసింది.
Read also : కరోనా వైరస్ పోయినా శానిటైజర్స్ వాడాల్సిందే.. ఎందుకో తెలుసా?
కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా 5వేలకు పైగా మరణాలు సంభవించాయి. దాదాపు లక్షన్నర పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లోనూ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఇప్పటివరకూ కరోనాతో ఇద్దరు చనిపోయారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Coronavirus in India: కరోనావైరస్ భారత్‌లో అంతగా వ్యాపించకపోవడానికి కారణాలు ఇవేనా ?