Taliban invite govt formation event : తాలిబన్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్య అతిథులుగా ఆ దేశాలు

Taliban invite China, Pakistanfor govt formation event : త్వరలో అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు చేయబోతున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. అందుకు తగ్గట్లుగా రంగం సిద్ధం చేస్తున్నారు. మరి అఫ్గాన్ ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏ దేశాలు హాజరవుతున్నాయనేది ఇప్పుడు హాట్ టాపిక్.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 7, 2021, 01:22 PM IST
  • అఫ్గానిస్థాన్‌లో ఏర్పాటు కాబోతున్న తాలిబన్ల ప్రభుత్వం
  • పాక్‌, చైనాలకు ఆహ్వానం పంపిన
  • ఇప్పటికీ అఫ్గాన్‌లోనే చైనా, పాక్‌ రాయబార అధికారులు
Taliban invite govt formation event : తాలిబన్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్య అతిథులుగా ఆ దేశాలు

Taliban invite China, Pakistanfor govt formation event : ప్రపంచం మొత్తం ఇప్పుడు అఫ్గానిస్థాన్‌ (Afghanistan) గురించే చర్చిస్తోంది. అఫ్గానిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు (Talibans).. తాజాగా పంజ్‌షేర్‌ లోయను హస్తగతం చేసుకున్నారు. త్వరలో అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు చేయబోతున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. అందుకు తగ్గట్లుగా రంగం సిద్ధం చేస్తున్నారు. మరి అఫ్గాన్ ప్రభుత్వ (Afghan government) ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏ దేశాలు హాజరవుతున్నాయనేది ఇప్పుడు హాట్ టాపిక్. అయితే ఇప్పటికే  పాకిస్థాన్‌, చైనా, టర్కీ, కతర్‌, రష్యా, ఇరాన్‌ దేశాలకు తాలిబన్లు ఆహ్వానం పంపారట. 

అఫ్గాన్‌లోనే చైనా, పాక్‌ రాయబార అధికారులు

తాలిబన్ల ఆక్రమణతో అఫ్గాన్‌ నుంచి చాలా దేశాల రాయబార కార్యాలయ అధికారులు (Embassy officials) స్వదేశాలకు వెళ్లిపోయినా  చైనా, పాకిస్థాన్‌, రష్యా అధికారులు అక్కడే ఉన్నారు. అఫ్గాన్‌లోని తాలిబన్లకు ఈ దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయనే విషయం దీన్ని బట్టే అర్థం అవుతోంది. 

Also Read : Panjshir Province: ఆఫ్ఘన్‌లో ముగిసిన ఆధిపత్యపోరు, పంజ్‌షీర్‌ కైవసం

ఇక తాలిబన్ల ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ కాబుల్‌లో విలేకరులతో మాట్లాడారు. అఫ్గాన్‌లో యుద్ధం ముగిసిందని చెప్పారు.  ఇప్పుడు పరిస్థితులు అన్నీ సర్దుకున్నాయని పేర్కొన్నారు. ఇతరులు తమ దేశాన్ని పునఃనిర్మించలేరనే విషయాన్ని అఫ్గాన్‌ ప్రజలు తెలుసుకోవాలని హితవు పలికారు. అంతేకాదు కతర్‌, టర్కీ, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన సాంకేతిక నిపుణులు కాబుల్‌ విమానాశ్రయంలో కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పాక్‌ మద్ధతుతోనే  తాలిబన్లు పంజ్‌షేర్‌ లోయను హస్తగతం చేసుకొన్నట్లు  తెలుస్తోంది. మొత్తానికి తాలిబన్లకు మద్దతు ఇచ్చే దేశాలైన పాక్‌, చైనాలు.. అఫ్గానిస్థాన్‌లో  (Afghanistan) తాలిబన్లు ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ ఏర్పాటుకు అతిథులుగా రానున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

Trending News