కెనడాలోని టొరాంటో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. టొరాంటోలో ఒక వ్యక్తి కాల్పులు జరిపాడని పోలీసులు చెప్పారు.కాల్పుల్లో తొమ్మిది మందికి గాయాలయ్యాయని, వారిలో ఒక యువతి ఉందని తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి మృతి చెందాడని పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన వారి ప్రస్తుత పరిస్థితి స్పష్టంగా తెలియదని టొరాంటో పోలీసులు ట్విటర్లో పేర్కొన్నారు.
టొరాంటోలోని గ్రీక్టౌన్లో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు కాల్పులు జరిగాయని సిటీ న్యూస్.కామ్ తన కథనంలో పేర్కొంది. సుమారు 25 సార్లు తుపాకీ పేలిన శబ్దాలు వినిపించాయని ఈ న్యూస్ వెబ్ సైట్ పేర్కొంది. కాగా, ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.