Anganwadi Gratuity: ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్‌వాడీలు ఏళ్ల తరబడి గ్రాట్యుటీ అమలుకై పోరాడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లపై ధర్నాలు చేసి పోలీసుల లాఠీచార్జ్ దెబ్బలు తిన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే కాదు..అంతకుముందు నుంచే ఈ డిమాండ్ ఉంది. ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరనుంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలకు గ్రాట్యుటీ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ప్రభుత్వం అవసరమైతే సొంతంగా అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రాష్ట్రంలోని అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ అమలుపై జీవో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే వెలువడనుంది. ప్రస్తుతం దేశంలో గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనే అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ అమల్లో ఉంది. కర్ణాటకలో కూడా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ప్రారంభమైంది. తాజాగా ఏపీ ప్రభుత్వం గ్రాట్యుటీ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో అంగన్‌వాడీలు ఎంతమంది, ఎంత ఖర్చు
రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్‌వాడీ కేంద్రాలుంటే అందులో లక్ష మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పనిచేస్తున్నారు. పదవీ విరమణ సమయంలో ప్రస్తుతం అంగన్‌వాడీ కార్యకర్తలకు లక్ష రూపాయలు, ఆయాలకు 40 వేల రూపాయలు అందుతున్నాయి. ప్రతి ఏటా 6 వందల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 700 మంది ఆయాలు రిటైర్ అవుతున్నారు. వీరందరికీ 8-10 కోట్లు ఖర్చవుతోంది.
గ్రాట్యుటీ అమలు చేస్తే...
గ్రాట్యుటీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి అదనంగా 10 కోట్లు ఖర్చవుతుంది. గ్రాట్యుటీ నిబంధనల ప్రకారం ఎన్నేళ్లు సర్వీసులో ఉంటే అన్ని సంవత్సరాలకు 15 రోజుల వేతనం చొప్పున చెల్లిస్తారు. ప్రస్తుతం ఏపీలో అంగన్‌వాడీ కార్యకర్తలకు 11,500 రూపాయలు జీతం లభిస్తుంటే 15 రోజుల జీతం అంటే 5700 రూపాయలు వస్తాయి. ఎవరైనా 27 ఏళ్లు సర్వీసులో ఉండి రిటైర్ అయితే ఆ మహిళకు 1.55 లక్షలు గ్రాట్యుటీ లభిస్తుంది. సర్వీసు పెరిగే కొద్దీ గ్రాట్యుటీ మొత్తం పెరుగుతుంటుంది. కొందరికి 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకూ వచ్చే అవకాశం ఉంది. ఆయాలకు ప్రస్తుతం నెలకు 7 వేలు చెల్లిస్తున్నారు. అంటే ఆయాలకు 3500 గ్రాట్యుటీ ఎన్నేళ్లు సర్వీసు ఉంటే అంత వస్తుంది. ఇలా అదనంగా 10 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా.
Also read: Ys Jagan Strong Warning: ఎవరు ఎక్కడున్నా బట్టలూడి కొడతాం...వైఎస్ జగన్ విశ్వరూపం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి