AP Rains: ఆంధ్ర ప్రదేశ్ వాసులను వరుణ దేవుడు వదలడం లేదు. ఇప్పటికే ఏపీలో తుఫాను గండం తప్పింది అనే లోపు అది తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయంటోంది. ప్రస్తుతం ఉత్తర అండమాన్ పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అది వాయువ్య దిశగా కదులుతూ 22 నాటికి అల్పపీడనంగా బలపడనున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని వివరించింది.
దీంతో కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలోని జిల్లాలో పాటు రాయలసీమలో ఇప్పటికే భారీ వర్షాలు కురిసాయి. అటు చెన్నై కూడా వాయు గుండం ప్రభావంతో అతలాకుతలమైంది. ఇప్పటికే అక్కడ ప్రజలు కార్లు, బైకులను నీళ్లలో మునిగిపోకుండా ఉండడానికి ఫ్లై ఓవర్ పై పార్క్ చేసారు. ఇప్పటికే చైన్నై సహా తీర ప్రాంతాల్లో వీస్తోన్న భారీ ఈదరు గాలులకు పార్క్ చేసిన కార్లు, బైకులు గాల్లో పల్టీలు కొట్టాయి. ఇప్పటికే అల్ప పీడనం ప్రభావంతో నార్త్ తమిళనాడులోని పలు జిల్లాలతో పాటు చెన్నై పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలతో జలమయమయ్యాయి.
ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు ముందు జాగ్రత్తల్లో భాగంగా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో స్కూల్లు కాలేజీలకు సెలవులను మరో రెండు రోజులు పొడిగించింది. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని ప్రభుత్వ అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. ఏపీలో కొన్ని జిల్లాలకు ఆకస్మిక వరదలు ఏర్పడే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది.
తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. ఇప్పటికే ఆయా జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వ అధికారులు సహాయ పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికీ తాగు నీరు, ఆహార ఏర్పాట్టు చేసారు. మరోవైపు రెండు రోజుల్లో బంగాళా ఖాతంలో మరో అల్ప పీడనంతో ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణకు కూడా వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter