ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై నిజంగానే దాడులు జరుగుతున్నాయా..సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజమెంత..ఏపీ పోలీసులు దీనిపై ఏమంటున్నారు.
ఏపీ ( AP ) లోని ఆలయాలు ఆపదలో ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ( Dgp Gowtham Sawang ) వివరణ ఇచ్చారు. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని..సత్యదూరమని ఖండించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీసు శాఖ ఆలయాల భద్రతను పాటిస్తోందని డీజీపీ స్పష్టం చేశారు. ఆలయాల భద్రత ( Temples security ) కు రాష్ట్ర ప్రభుత్వం ( Ap Government ) తీసుకున్న చర్యల్ని వివరించారు.
రాష్ట్రంలో 2020 సెప్టెంబరు 5వ తేదీ నుండి ఇప్పటి వరకు 58 వేల 871 దేవాలయాలను జియో ట్యాగింగ్ ( Geo Tagging ) తో అనుసంధానం చేశామని గౌతమ్ సవాంగ్ ( Gowtham sawang ) తెలిపారు. మరోవైపు నిరంతర నిఘా కోసం 43 వేల 824 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 44 దేవాలయ సంబంధిత నేరాలలో 29 కేసులను ఛేదించడంతో పాటు 80 మంది కరుడుగట్టిన అంతర్రాష్ట్ర నేరస్థులను అరెస్టు చేశామని చెప్పారు.
Also read: Chandrababu Naidu: భోగి వేడుకల్లో చంద్రబాబు.. జీవో ప్రతుల దహనం
2020 సెప్టెంబర్ 5 తరువాత దేవాలయాల్లో ప్రాపర్టీ ఆక్షన్‌కు సంబంధించి 180 కేసుల్ని ఛేధించి..337 మందిని అరెస్టు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల 256 గ్రామ రక్షణ దళాలు ఏర్పాట్లు చేయాల్సి ఉందని..ఇప్పటికే 15 వేల 394 గ్రామ రక్షణ దళాలను నియమించామన్నారు. కొంతమంది పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాలు, ప్రచార మాధ్యమాల్లో దేవాలయానికి సంబంధించి తప్పుడు వార్తలను ప్రసారం చేయడం, ప్రచారం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని..వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
మత సామరస్యానికి ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ఓ ప్రతీక అని..దానిని కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులపై సిట్ (SIT ) ఏర్పాటు చేశామన్నారు. తరచూ ఈ రకమైన నేరాలకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామన్నారు. అనవసరమైన విషయాలలో ఉద్దేశపూర్వకంగా దేవాలయ సంబంధిత అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారని డీజీపీ స్పష్టం చేశారు.
ఆలయాలు, ప్రార్ధనా మందిరాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గమనిస్తే..వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా 100 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. దీనికోసం ప్రత్యేకంగా 9392903400 నెంబర్‌ను కేటాయించామన్నారు.
Also read: APSRTC ఎండీగా మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్.. ఉత్తర్వులు జారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook