Roja On Gorantla: ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

Roja On Gorantla: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వివాదంపై ఏపీ ఫైర్ బ్రాండ్ లీడర్, మంత్రి రోజా స్పందించారు. ఎంపీ న్యూడ్ వీడియోపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Written by - Srisailam | Last Updated : Aug 7, 2022, 01:08 PM IST
  • ఎంపీ గోరంట్ల వీడియోపై స్పందించిన రోజా
  • ఆ వీడియో నిజమో కాదో తెలియదు- రోజా
  • రోజా వ్యాఖ్యలపై మహిళా సంఘాల ఫైర్
Roja On Gorantla: ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

Roja On Gorantla: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వివాదంపై ఏపీ ఫైర్ బ్రాండ్ లీడర్, మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆ వీడియో నిజమో కాదో తెలియదన్నారు మంత్రి రోజా. వీడియోకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాకే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మహిళలపై ఎన్ని అకృత్యాలు జరిగినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థునులు వేధింపులకు గురైనా ఒక కేసైనా పెట్టారా అని రోజా ప్రశ్నించారు.

ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ ప్రకంపనలు ఏపీలో కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై జాతీయ స్థాయిలోనూ చర్చ జరిగింది. ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలల వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది.  గౌరవప్రదమైన ఎంపీ హోదాలో ఉండి మహిళతో న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడిన వీడియో బయటికి రావడంతో అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినా ఎంపీపై  వైసీపీ అధిష్టానం ఇంతవరకు చర్య తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. వీడియో బయటికి వచ్చిన రోజే ఎంపీ గోరంట్లను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తారని భావించినా... మూడు రోజులైనా వైసీపీ అధిష్టానం సైలెంట్ గానే ఉంది. సీఎం జగన్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.

మహిళతో న్యూడ్ వీడియో కాల్ చేసి అడ్డంగా బుక్కైనా ఎంపీపై చర్య తీసుకోకపోవడంపై జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండగా.. తాజాగా మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. మహిళా మంత్రిగా ఉండి రాసలీలల ఎంపీని సమర్ధించేలా మాట్లాడటం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. వీడియో ఫేక్ కాదని నిపుణులు చెబుతున్నా... ఇంకా నిజం తేలలేదంటూ రోజా మాట్లాడటంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. రాసలీలల ఎంపీని రోజా వెనకేసుకు రావడం దారుణం అంటున్నారు టీడీపీ మహిళా నేతలు. నీచమైన పని చేస్తూ అడ్డంగా దొరికిన ఎంపీని కాకుండా టీడీపీపై రోజా విమర్శలు చేయడం ఏంటని నిలదీస్తున్నారు.

Read also: Pawan Kalyan: కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన పవన్ .. వైసీపీ నేత బాలినేనిని నామినేట్ చేసిన జనసేన చీఫ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News