/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Heavy Rains in Telanagana and AndhraPradesh: గత కొద్దిరోజులుగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అల్లాడించాయి. రుతుపవనాలు ఆలస్యం కావడంతో వర్షం జాడలేక భారీ ఎండలు, వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రుతుపవనాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్ని సేదతీర్చాయి.

ఏపీలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 10 రోజులు ఆలస్యంగా జూన్ 12న తాకిన నైరుతి రుతుపవనాలు విస్తరించకుండా ఆగిపోయాయి. దాంతో రుతుపవనాలు ప్రవేశించినా 8 రోజుల వరకూ వర్షాల్లేవు. నిన్నట్నించి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరించడం ప్రారంభమైంది. ఫలితంగా తూర్పు గోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో నిన్న అంటే జూన్ 20వ తేదీన భారీ వర్షాలు కురిశాయి. ఎండవేడిమితో తల్లడిల్లిన ప్రజానీకం వర్షంతో ఒక్కసారిగా సేదతీరారు. విజయవాడ, రాజమండ్రి నగరాల్లో భారీ వర్షం గంటకుపైగా కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాను కారణంగా నైరుతి రుతుపవనాల విస్తరణ ఆలస్యమైంది. 

రానున్నరెండ్రోజులు కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 21 అంటే ఇవాళ తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. ఇక విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని ఐఎండీ వెల్లడించింది.

మరోవైపు నైరుతి రుతుపవనాలు రేపట్నించి తెలంగాణలో ప్రవేశించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఏపీలో విస్తరిస్తున్న రుతుపవనాలు ఇక తెలంగాణకు కూడా వ్యాపించనున్నాయి. అదే జరిగితే రేపట్నించి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు పలకరించనున్నాయి. 

ముఖ్యంగా ఏపీలోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. 

Also Read: Margadarsi Case: మార్గదర్శికి మరో షాక్, 23 చిట్ గ్రూపులు నిలిపివేత, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Section: 
English Title: 
Ap weather forecast and southwest monsoon effect heavy rains alert to 8 districts of ap, telangana will have rains from tomorrow
News Source: 
Home Title: 

Heavy Rains in Telugu States: విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు.. ఆ 8 జిల్లాలకు భారీ వర్ష సూచన!

Heavy Rains in Telugu States: విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు.. ఆ 8 జిల్లాలకు భారీ వర్ష సూచన!
Caption: 
AP Rains ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Heavy Rain Alert: విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు.. ఆ 8 జిల్లాలకు భారీ వర్ష సూచన!
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Wednesday, June 21, 2023 - 18:43
Created By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
42
Is Breaking News: 
No
Word Count: 
286