Chandrababu Case: టీడీపీ అధినేత చంద్రబాబు, అతని కుమారుడు నారా లోకేశ్‌లు నిందితులుగా ఉన్న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కేసులో నారా లోకేశ్‌ను సీఐడీ విచారించనుంది. ఈ కేసులో ఏ14గా ఉన్న లోకేశ్‌కు 41ఏ కింద సీఐడీ నోటీసులు జారీ చేసింది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు తోడుగా నారా లోకేశ్‌ను అరెస్టు చేయాలనే ప్రయత్నానికి బ్రేక్ పడింది. ఈ కేసులో అక్టోబర్ 4 వరకూ నిరీక్షించాలని హైకోర్టు సూచించింది. మరోవైపు ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణను హైకోర్టు అక్టోబర్ 4 వరకూ వాయిదా వేసింది. ఇదే కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కూడా వాయిదా పడింది. ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా ఉన్న నారా లోకేశ్‌ను అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావల్సిందిగా సీఐడీ నోటీసులు జారీ చేసింది. 41ఏ కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి.
ఢిల్లీలో ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో ఉన్న లోకేశ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఏ కేసులో నోటీసులిస్తున్నారని లోకేశ్ ప్రశ్నించగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అని సీఐడీ సమాధానమిచ్చింది. 41(3), 41(4) సెక్షన్ వివరాల్ని సీఐడీ నుంచి అడిగి తెలుసుకున్నారు లోకేశ్. నోటీసులిచ్చేటప్పుడు లోకేశ్‌తో పాటు ఎంపీ కనకమేడల అక్కడే ఉన్నారు.
లోకేశ్‌కు నోటీసులిచ్చేక్రమంలో ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో సీఐడీ పోలీసులు దాదాపు 20 నిమిషాలున్నారు. విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి ఉదయం 10 గంటలకు రావల్సిందిగా సూచించారు. నోటీసులు అందుకున్న లోకేశ్ అందినట్టుగా లిఖితపూర్వకంగా తెలిపారు.
Also read: RBI Good News: ఆర్బీఐ గుడ్‌న్యూస్, 2 వేల నోటు మార్చేందుకు మరో వారం రోజులు గడువు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook