కరోనా ( corona ) కట్టడి విషయంలో ఏపీలో పరిస్థితులు ఆశాజనకంగా కన్పిస్తున్నాయి. కరోనా యాక్టివ్ కేసులు, మరణాల్లో తగ్గుదల ఏపీలో బాగుందని సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలోని కరోనా కేసులు ( Corona cases ) , యాక్టివ్ కేసులు ( Active cases ) , మరణాలను ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ విశ్లేషిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని కరోనా యాక్టివ్ కేసులు, మొత్తం కేసులు, మరణాల సంఖ్య, నిర్వహిస్తున్న పరీక్షల్ని పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కరోనా యాక్టివ్ కేసులు, మరణాల్లో తగ్గుదల బాగుందని కేంద్ర ఆరోగ్య శాఖ ( Central Health ministry ) ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల్లో ప్రతిరోజూ 13.7 శాతం తగ్గుదల కన్పిస్తోందని..అటు మరణాల్లో అయితే ప్రతిరోజూ 4.5 శాతం తగ్గుదల ఉంటోందని పేర్కొంది. ఆగస్టు 13-19 తేదీల్లో ఏపీలో 1 లక్షా 12 వేల 714 యాక్టివ్ కేసులుంటే...ఆగస్టు 20-26 తేదీల మధ్యకాలంలో ఆ సంఖ్య 88 వేల 612కు తగ్గిపోయింది. ఇక ఆగస్టు 27-సెప్టెంబర్ 2 మధ్యకాలంలో 97 వేల 272 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలోని మొత్తం కరోనా మరణాల్లో ఏపీ 6.12 శాతం కలిగి ఉంది. కరోనా కేసుల నమోదులో దేశంలో ఏపీ రెండోస్థానంలో నిలిచినా...రికవరీ రేటులో మాత్రం అగ్రస్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కరోనా మరణాల రేటును కూడా ఏపీ ప్రభుత్వం గణనీయంగా తగ్గించగల్గిందని తెలిపింది.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రోజుకు దాదాపు 50-60 వేల చొప్పు పరీక్షలు నిర్వహిస్తుండటంతో కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే అదే సమయంలో రికవరీ రేటు కూడా పెరగడం నిజంగా మంచి పరిణామం. Also read: AP Cabinet: పలు కీలక నిర్ణయాలు...ఆన్ లైన్ లో రమ్మీ, పోకర్ లపై నిషేధం