IMD Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం తగ్గింది. అల్పపీడనంగా బలహీనపడి తీరం వెంబడి వాయువ్య దిశగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో మరింతగా బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారనుంది. ఫలితంగా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
ఏపీకు అల్పపీడనం ప్రభావం తగ్గుతోంది. అల్పపీడనం బలహీనమై రానున్న 24 గంటల్లో ఉపరితల ఆవర్తనంగా మారనుంది. అయినా సరే ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఐఎండీ తెలిపింది. కోస్తా తీరంలో బలమైన ఈదురు గాలులుంటాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. నెల్లూరు జిల్లాలో మాత్రం భారీ వర్షం కురిసే పరిస్థితి కన్పిస్తోంది. నెల్లూరుతో పాటు చిత్తూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షం పడే సూచనలున్నాయి. రేపట్నించి నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి.
తెలంగాణపై కూడా అల్పపీడనం ప్రభావం చూపించనుంది. హైదరాబాద్ ప్రాంతంలో చిరుజల్లులు పడనున్నాయి. రానున్న రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చలితీవ్రత పెరగనుంది. తూర్పు , ఆగ్నేయ దిశగా వీస్తున్న శీతలగాలుల ప్రభావం తెలంగాణపై అధికంగా ఉండనుంది. ఇటు ఏపీలో కూడా చలి తీవ్రత రానున్న 4 రోజులు మరింత ఎక్కువ కానుంది.
మరోవైపు వాతావరణ శాఖ ఏపీ, తెలంగాణకు సంబంధించి కీలక సూచనలు చేసింది. ఈ ఏడాదికి ఇవే ఆఖరి వర్షాలని స్పష్టం చేసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ , ఏప్రిల్ నెలల వరకూ భారీ వర్షాలుండవని తేల్చిచెప్పింది. చలి మాత్రం సంక్రాంతి వరకూ కొనసాగనుంది.
Also read: Andhra Pradesh: నేడు ఏపీలోనూ సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి.. అసలు కారణం ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.