Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan Comments: జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రంతా మతాలు, కులాల ప్రస్తావనతో సాగుతోంది. జనసేనానికి హఠాత్తుగా ముస్లిం ఓట్లు గుర్తొచ్చినట్టున్నాయి. ముస్లింలు, బీజేపీతో సాన్నిహిత్యం గురించి ప్రస్తావించారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 20, 2023, 04:50 PM IST
Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan Comments: వారాహి యాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగమంతా వ్యక్తిగత ఆరోపణలు, కుల,మతాల ప్రస్తావనతోనే సాగుతున్నట్టు అన్పిస్తోంది. ఇవాళ హఠాత్తుగా ముస్లిం ఓట్ల గురించి ప్రస్తావించారు. అది కూడా బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. కులాల ప్రస్తావన, స్థానిక ఎమ్మెల్యేలపై వ్యక్తిగత ఆరోపణలతో సినిమాటిక్ స్టైల్లో దూసుకెళ్తున్న పవన్ కళ్యాణ్‌కు ఒక్కసారిగా ముస్లిం ఓట్లు గుర్తొచ్చాయి. తాను బీజేపీలో ఉన్నాననే కారణంతో తనను వదిలివేయవద్దంటూ వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ఒకవేళ తనను ముస్లింలు వదిలేస్తే ముస్లింలకే నష్టమని బెదిరింపు ధోరణిలో మాట్లాడటం సంచలనంగా మారింది. దేశంలో 17 శాతం ముస్లింలు ఉన్నారంటే సమాజం అందర్నీ గౌరవిస్తోందని అర్ధమని పవన్ కళ్యాణ్ తెలిపారు. 

బీజేపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీ ముస్లింలకు నచ్చదని, జగన్ క్రిస్టియన్ కాబట్టి ఆయనకు ఓట్లు వేయవచ్చని ముస్లింలు అనుకుంటున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాను బీజేపీతో ఉన్నందున వదిలివేయాలనుకుంటే ముస్లింలే నష్టపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇక తనకున్న సామర్ధ్యాన్ని బట్టి ఏదో ఒక పదవి పొందవచ్చని, అందరితో ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదన్నారు. అధికారమే అంతిమలక్ష్యం అనుకుంటే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదన్నారు. చాలా చిత్తశుద్ధితో జనసేన పార్టీని స్థాపించానని, ముఖ్యమంత్రి జగన్‌లా తాను అద్భుతాలు చేస్తానని చెప్పనన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధుల్ని గెలిపించాలని అభ్యర్ధించారు. తనకు ఎంపీలను అందిస్తే పని చేయిస్తానని, పవన్‌కు ఇంత ఓట్ షేర్ ఉంది కాబట్టే ప్రధానమంత్రి తనను పిలిచారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. 

Also read: Jagananna Animutyalu Scheme 2023: జగనన్న ఆణిముత్యాలు–స్టేట్ బ్రిలియన్స్ అవార్డ్స్.. ఎవరికి ఎంత ప్రైజ్ మనీ..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News