Michaung Cyclone: తీవ్ర రూపం దాల్చిన మిచౌంగ్ తుపాను మరి కాస్సేపట్లో బాపట్ల వద్ద తీరం దాటనుంది. ఇప్పటికే తీరాన్ని తాకడంతో ఆ ప్రభావం కోస్తాతీరంపై తీవ్రంగా కన్పిస్తోంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక అధికారులతో సమావేశమయ్యారు.
మిచౌంగ్ తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభం కావడంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు-కావలి మధ్య ప్రస్తుతం తీరం దాటే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. చీరాల, బాపట్ల మద్యనే తీరం దాటనుందని అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. మరోవైపు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో క్రమంగా తుపాను ప్రభావం తగ్గుతోందన్నారు. అదే సమయంలో కృష్ణా, ఎన్టీఆర్, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. తుపాను నేపధ్యంలో ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశామని ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటి వరకూ 211 సహాయ శిబిరాలకు 9500 మందిని తరలించినట్టు చెప్పారు.
బాధితులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు. సహాయ శిబిరాల్లో సౌకర్యాల కల్పనలో ఏ పొరపాట్లు జరగకూడదన్నారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను తక్షణం పునరుద్ధరించాలన్నారు. ప్రాణనష్టం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే సూచించారు. గ్రామ, వార్డు, సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను వాడుకుని రేషన్ పంపిణీ సమర్ధవంతంగా చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు.
మరోవైపు తీర ప్రాంత ఎమ్మెల్యేలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వర్షాలు తగ్గగానే పంటనష్టం అంచనా వేసి పరిహారం చెల్లిస్తామన్నారు. సహాయక చర్యల్లో ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకూడదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు మిచౌంగ్ తుపాను తీరం దాటుతుండటంతో పరిస్థితి తీవ్రతరమౌతోంది. తీరం వెంబడి గాలులు తీవ్రత పెరుగుతోంది. సముద్రం అల్లకల్లోలంగా మారి ముందుకు చొచ్చుకొస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
Also read: Michaung Cyclone Impact: మిచౌంగ్ తుపాను ప్రభావం, మూతపడ్డ విమానాశ్రయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook