YS Vijayamma Accident: వైఎస్ విజయమ్మ హత్యకు కుట్ర? కారు ప్రమాదంపై ఎంపీ రఘురామ సంచలన ఆరోపణలు..

YS Vijayamma Accident: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ రెండు రోజుల క్రితం పెను ప్రమాదం తప్పింది. ఓ ఫంక్షన్ కు హాజరై హైదరాబాద్ తిరిగి వస్తున్న వైఎస్ విజయమ్మ కారు అనంతపురం జిల్లా గుత్తి దగ్గర ప్రమాదానికి గురైంది

Written by - Srisailam | Last Updated : Aug 13, 2022, 03:17 PM IST
  • వైఎస్ విజయమ్మ కారుకు ప్రమాదం
  • కారు ప్రమాదంపై ఎంపీ రఘురామ అనుమానాలు
  • కుట్ర కుణం ఉందన్న ఎంపీ రఘురామ
YS Vijayamma Accident: వైఎస్ విజయమ్మ హత్యకు కుట్ర? కారు ప్రమాదంపై ఎంపీ రఘురామ సంచలన ఆరోపణలు..

YS Vijayamma Accident: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ రెండు రోజుల క్రితం పెను ప్రమాదం తప్పింది. ఓ ఫంక్షన్ కు హాజరై హైదరాబాద్ తిరిగి వస్తున్న వైఎస్ విజయమ్మ కారు అనంతపురం జిల్లా గుత్తి దగ్గర ప్రమాదానికి గురైంది. కారు టైర్లు పేలిపోయాయి. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యహరించిన కారును కంట్రోల్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారు ప్రమాదం నుంచి వైఎస్ విజయమ్మ సురక్షితంగా బయటపడ్డారు. విజయమ్మ కారు ప్రమాదానికి గురైందన్న వార్త ఏపీలో సంచలనమైంది.

వైఎస్ విజయమ్మ కారుకు జరిగిన ప్రమాదంపై తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు సంచలన కామెంట్లు చేశారు. విజయమ్మ కారు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందనే ఆరోపణలు చేశారు. తాను కొన్ని దశాబ్దాల నుంచి కార్లు వాడుతున్నానని.. లక్షల కిలోమీటర్లు కార్లలోనే తిరిగానని తెలిపారు. లక్షల కిలోమీటర్లు తిరిగినా తన కార్ల టైర్లు ఎప్పుడు పేలిపోలేదని రఘురామ కృష్ణం రాజు చెప్పారు. దేశంలోకి 15 ఏళ్ల క్రితమే ట్యూబ్ లెస్ టైర్లు వచ్చాయని అన్నారు. వైఎస్ విజయమ్మ ప్రయాణించింది కారు టయోటా వెల్పేర్ మోడల్ కారు. ఈ కారు విదేశాల నుంచి దిగుమతి అయిందని, కారుకు ట్యూబ్ లెట్ టైర్లు ఉన్నాయ.న్నారు రఘురామ రాజు. విజయమ్మ ప్రయాణించిన కారు ఇప్పటివరకు కేవలం 3 వేల 5 వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందన్నారు. అలాంటి కారుకి రెండు టైర్లు పేలిపోవడం అసంభవమని ఎంపీ రఘురామ వివరించారు.

కార్ల టైర్లు బారా అరిగిపోతే తప్ప పేలిపోయే అవకాశం ఉండదన్నారు ఎంపీ రఘురామ రాజు. కాని విజయమ్మ ప్రయాణించిన కారు కొత్తదని.. టైర్లు కూడా కొత్తవని.. కేవలం ౩ వేల 5 వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగాయన్నారు. కొత్త కారుకు చెందిన రెండు ట్యూబ్ లెస్ కార్లు ఒకేసారి పేలిపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు రఘురామ రాజు. ప్రమాదం జరిగినప్పుడు కారు తక్కువ స్పీడులోనే వెళుతుందని డ్రైవర్ చెప్పినట్లు తనకు తెలిసిందన్నారు. ఎండాకాలంలో కొన్ని టైర్లు పేలిపోతుంటాయని.. కాని ఇప్పుడు వర్షాకాలమని.. కొన్నిరోజులుగా వర్షాలు బాగా కురుస్తున్నాయని రఘురామ వివరించారు. వర్షాకాలంలో రెండు టైర్లు ఎందుకు పేలిపోయాయే జిల్లా ఎస్పీతో కాకుండా కారు కంపెనీతో వివరణ ఇప్పిస్తే అసలు ఏం జరిగిందో చెప్పాలన్నారు.

విజయమ్మ కారు ప్రమాదంపై అనుమానాలు వస్తున్నందున ఏదైనా కుట్ర ఉందేమో తేల్చాలని ఏపీ సీఎం జగన్ ను కోరారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని తక్షణం విచారణ చేయించాలన్నారు. ఏపీలో ఏం జరిగినా వైసీపీ నేతలు  దుష్ట చతుష్టయం పాత్ర ఉందని ఆరోపణలు చేస్తుంటారని.. విజయమ్మ కారు ప్రమాదం  వెనుక వాళ్లు ఎవరైనా ఉన్నారేమో, ఏదైనా కుట్ర ఉందేమో కూడా తేల్చాలన్నారు.

Read also: Munugode Trs: మునుగోడు టీఆర్ఎస్ లో ట్విస్ట్.. టికెట్ రేసులో కర్నె, కంచర్ల? అసమ్మతి స్వరంతో కూసుకుంట్ల అవుట్..

Read also:  Munugode Byelection: రేవంత్ రెడ్డి పాదయాత్రకు ముందు కలకలం.. రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మునుగోడులో పోస్టర్లు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

 

Trending News