Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం గత నాలుగు దశాబ్దాలకు పైగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో బాగా నానిన పేరు. కాపు నేతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా జరిగిన 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిస్తే తనపేరు మార్చుకుంటానని సవాల్ చేసి అన్న పని చేయబోతున్నాడు. ఏదో మాట వరసకు పేరు మార్చుకుంటానని ఎంతో మంది వ్యక్తులు కొన్ని విషయాల్లో సవాల్ చేస్తుంటారు. కానీ ఆచరణలో మాత్రం పెట్టరు. కానీ ముద్రగడ పద్మనాభం మాత్రం అన్న మాట ప్రకారం ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయ దుంధుభి మోగించడంతో తాను చేసిన సవాల్లో ఓడిపోయానని వైయస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. అందుకే తన పేరును మార్చుకుంటున్నట్టు చెప్పారు.
సవాల్ ప్రకారం నా పేరు పద్మనాభ రెడ్డిగా తన పేరును మార్చుకుంటున్నట్టు ప్రకటించారు. దానికి సంబంధించిన ఫైల్స్ సిద్దం చేసుకుంటున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రజలు ఎందుకు ఓటు వేయలేదనే విషయాన్ని లోతుగా అధ్యనం చేస్తున్నామన్నారు. ఏది ఏమైనా తాను జగన్ వెంటే అని చెప్పుకొచ్చారు. ముద్రగడ పద్మనాభం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు. 1977లో రాజకీయ అరంగేట్రం చేసిన పద్మనాభ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎంపీగా.. రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసారు. 2014లో చిరరగా పత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
Also read: AP Assembly Results 2024: ఏపీ ఎన్నికల్లో జనసేన క్లీన్‌స్వీప్, పవన్ సహా ఎవరి మెజార్టీ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook