Pegasus Spyware: ఇజ్రాయిల్ కంపెనీ అభివృద్ధి చేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారంలో ఎన్నో ప్రశ్నలు విన్పిస్తున్నాయి. దేశ రక్షణ, అంతర్గత వ్యవహారాలకు ప్రమాదం పొంచి ఉందా..మమతా వ్యాఖ్యల తీవ్రత ఎంతవరకూ ఉంది..నాడు ఏబీ వెంకటేశ్వరరావు చేసింది అదేనా..
పెగాసస్ నిఘా సాఫ్ట్‌వేర్ వ్యవహారం ఏపీలో పెను దుమారమే రేపుతోంది. ఓ వైపు సుప్రీంకోర్టులో ఇదే అంశం విచారణలో ఉండగానే..పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం మెడకు చుట్టుకున్నాయి. మమత వ్యాఖ్యల్ని ఆసరాగా తీసుకున్న ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ..టీడీపీపై విమర్శలు సంధించింది. తెలుగుదేశం పార్టీని ఇరుకునపెట్టేందుకు అసెంబ్లీలో చర్చ సాగించింది. అటు ఢిల్లీలో మీడియా సమావేశం ద్వారా వైసీపీ ఎంపీలు ఇదే అంశంపై మాట్లాడారు.
దేశ రక్షణ, భద్రతకు ముప్పే
పెగాసస్ స్పైవేర్ కొనుగోలు, వినియోగంతో చంద్రబాబు చేసింది ముమ్మాటికీ దేశద్రోహమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, తలారి రంగయ్య, ఎన్ రెడ్డెప్పలు స్పష్టం చేశారు. నాడు చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసిందనే మమతా బెనర్జీ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఇజ్రాయిల్ కంపెనీతో నాటి ఏపీ ఇంటెలిజెన్స్ అదనపు డీదీ ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో జరిపిన వ్యవహారమిదేనని..కేంద్రం ఈ అంశంపై చూసీచూడనట్టు ఉండటం మంచిది కాదన్నారు. మమతా బెనర్జీ వ్యాఖ్యల్ని సుమోటోగా స్వీకరించి దర్యాప్తు ఆదేశించాలని కేంద్రాన్ని, రాష్ట్రపతిని కోరుతున్నామన్నారు. దేశ అంతర్గత వ్యవహారం, భద్రతకు ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు.
హౌస్ కమిటీ అంటే భయమెందుకు
ఇక ఏపీలో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు.పెగాసస్ వ్యవహారంపై తప్పుచేయనప్పుడు..హౌస్ కమిటీ అంటే భయమెందుకని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయడం మంచి పరిణామమన్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నాటి ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం 25 కోట్లతో ఇజ్రాయిల్ నుంచి పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేశారనేది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణ. ఇప్పుడీ వ్యవహారంపై హౌస్ కమిటీ దర్యాప్తు చేసి..కొనుగోలు జరిగిందా లేదా, ఎవరి పాత్ర ఉంది..ఆ స్పైవేర్‌తో ఏం చేశారనేది పూర్తిగా నిగ్గు తేలనుందని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. నాటి ఇంటెలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వరరావు నడిపిన వ్యవహారమిదేనని చెప్పారు.
Also read: Pegasus Spyware: పెగాసస్ వ్యవహారం టీడీపీ మెడకు చుట్టుకోనుందా..హౌస్ కమిటీ ఏర్పాటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook