Viveka Murder Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఈ కేసులో ఏ 4 దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. పిటీషనర్ పేర్కొన్న అంశాలు చర్చకు దారితీస్తున్నాయి. సీబీఐ స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.
రాష్ట్రంలో సంచలనం రేపిన వివేకా హత్య కేసు తెలంగాణ హైకోర్టు పరిధిలో ఉంది. మరోవైపు కేసు దర్యాప్తు సీబీఐ చేస్తోంది. ఇప్పటికే మూడుసార్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ..అతని తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారించాల్సి ఉంది. వాస్తవానికి గత వారమే భాస్కర్ రెడ్డిని విచారణకు పిలవగా..ఆయన హైదరాబాద్ సీబీఐ ఆఫీసుకు హాజరయ్యారు. అయితే ఆ సమయంలో సీబీఐ అధికారులు అందుబాటులో లేక మరోసారి నోటీసులిస్తామని వెల్లడించారు. తిరిగి ఆయనను ఎప్పుడు విచారించేది తెలియాల్సి ఉంది.
ఈ నేపధ్యంలో వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ కీలకంగా మారింది. వివేకా హత్య కేసులో ఏ4 దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఆయన పిటీషన్ దాఖలు చేశారు. దస్తగిరి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా తమను నేరంలోకి నెట్టడం సరైంది కాదని భాస్కర్ రెడ్డి తెలిపారు. సీబీఐ చెప్పినట్టే దస్తగిరి ప్రకటనలు ఇస్తున్నాడని పిటీషనర్ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసులో ఆయుధం కొనుగోలు చేసింది, కీలకంగా వ్యవహరించించి దస్తగిరేనని..అలాంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వడం సరైంది కాదని పిటీషనర్ తెలిపారు. దస్తగిరికి బెయిల్ వచ్చేలా సీబీఐ సహకరించిందని..అతనికి వ్యతిరేకంగా ఉన్న ఆధారాల్ని దర్యాప్తు సంస్థ పట్టించుకోలేదని కోర్టుకు విన్నవించారు.
మరోవైపు వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరై అడిగిన సమాచారాన్ని ఇచ్చారు. తన విచారణ రికార్డు చేయాలంటూ దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. అరెస్టు చేయవద్దన్న అవినాష్ రెడ్డి వాదనను తోసిపుచ్చింది టీఎస్ హైకోర్టు. ఇప్పుడు సీబీఐ విచారణను, వైఖరిని తప్పుబడుతూ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై సీబీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Also read: Heavy Rains Alert Telugu States: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. మరో 48 గంటలు కొనసాగనున్న వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook