Apple iPhone 11 Price Cut: పాపులర్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 11 ధరలు భారీగా తగ్గింపు

Apple iPhone 11 Revised Price:   ఐఫోన్ 12 ఆవిష్కరించిన యాపిల్ సంస్థ ప్రపంచంలో అత్యంత పాపులర్ స్మార్ట్‌ఫోన్ మోడల్ ఐఫోన్ 11 ఫోన్లపై భారీగా ధరలు తగ్గించింది. ఐఫోన్ 11 మోడల్ ధరలు తగ్గడంతో ఐఫోన్ 12 కొనుగోలు కన్నా పాత మోడల్ విక్రయాలు పెరిగేలా కనిపిస్తుంది.

Last Updated : Oct 15, 2020, 01:12 PM IST
Apple iPhone 11 Price Cut: పాపులర్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 11 ధరలు భారీగా తగ్గింపు

టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ ఇటీవల ఐఫోన్ 12 మోడల్స్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. వర్చువల్ ఈవెంట్ ద్వారా రెండు రోజుల కిందట ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ను ఆవిష్కరించడం తెలిసిందే. అయితే ఐఫోన్ 12 (iPhone 12) ఆవిష్కరించిన యాపిల్ సంస్థ ప్రపంచంలో అత్యంత పాపులర్ స్మార్ట్‌ఫోన్ మోడల్ ఐఫోన్ 11పై భారీగా ధరలు (Apple iPhone 11 Price Cut) తగ్గించింది. 

ఐఫోన్ 12 మార్కెట్‌లోకి విడుదల చేసిన అనంతరం ఐఫోన్ 11 మోడల్‌పై రూ.13,400 మేర ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఐఫోన్ 11 మోడల్స్ ప్రపంచంలోనే పాపులర్, అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ కావడంతో నెటిజన్లు ఇదే మోడల్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read : Fastest Ball In IPL: డెల్ స్టెయిన్ రికార్డు బద్దలు.. ఐపీఎల్‌లో వేగవంతమైన బౌలర్ ఇతడే

 

ఐఫోన్ 11 ప్రస్తుత ధర ఎంత? (Apple iPhone 11 Revised Price)
ఐఫోన్ కొన్ని రోజుల కిందట బేసిక్ మోడల్ ధర రూ.68,300, కాగా, నేడు ఐఫోన్ 11 ధర రూ.54,900కి దిగొచ్చింది. 128జీబీ, 256 జీబీ మోడల్ ఐఫోన్ 11 ధరలు సైతం రూ.13,700, రూ.14,200 తగ్గించడంతో.. ప్రస్తుత ధరలు వరుసగా రూ.59,900, రూ.69,900గా ఉన్నాయి.

 

కాగా, ఇటీవల ఆవిష్కరించిన ఐఫోన్‌ 12 ప్రారంభ ధర (iphone 12 Price) రూ.79,900, ఐఫోన్‌ 12 మినీ రూ.69,900. ఐఫోన్‌ 12 స్క్రీన్ సైజ్ 6.1 అంగుళాలు ఉండగా, ఐఫోన్‌ 12 మినీ స్క్రీన్ సైజ్ 5.7 అంగుళాలుగా ఉంది. ఇక ఐఫోన్‌ 12 ప్రో ప్రారంభ ధర భారత్‌లో రూ.1,19,900. దీని స్క్రీన్ సైజ్ 6.5 అంగుళాలు. ఐఫోన్‌ 12 ప్రో మ్యాక్స్‌ ధర  రూ.1,29,900. దీని స్క్రీన్ సైజ్ 6.7 అంగుళాలు. భారత మార్కెట్‌లోకి ఐఫోన్‌ 12, ఐఫోన్ 12 ప్రో మోడల్స్ అక్టోబరు 30 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News