Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న భారత చరిత్రలోనే అతిపెద్ద బడ్జెట్ ను విడుదల చేయనున్నారు. గతఏడాది కంటే ఈసారి దాదాపు రూ. 3లక్షల కోట్లు అదనంగా రూ. 50లక్షల కోట్లకుపైగా బడ్జెట్ విడుదల అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే భారత్ వైపు చూసే పొరుగు దేశం పాకిస్తాన్ బడ్జెట్ ఇందులో చాలా అంటే చాలా తక్కువ అని చెప్పవచ్చు. గత ఏడాది పాకిస్తాన్ లో రూ. 5.65లక్షల కోట్ల బడ్జెట్ విడుదల చేశారు. ఇక ఈసారి ఆర్థిక మంత్రి సీతారామన్ వరుసగా 8వ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక కార్యదర్శి తుహిన్ కాంత్ పాండేతో సహా కీలక అధికారులతో కలిసి 2025-26 కోసం రూ. 50లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ను సిద్ధం చేశారు. ఈసారి బడ్జెట్ లో నెమ్మదించిన ఆర్థిక వృద్ధి అమెరికా డాలర్ తో రూపాయి బలహీనత వినియోగ డిమాండ్ లో క్షీణత వంటి అనేక సవాళ్లను పరిష్కరించాల్సి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్ట స్థాయి 6.4శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2019లో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తర్వాత ఇది అత్యల్ప వృద్ధి రేటు.
Also Read: Pm Modi On Budget 2025: మోదీ మాటల అర్థం అదేనా? మధ్య తరగతి ప్రజలకు బడ్జెట్‌లో అదిరే గిఫ్ట్!
ఆర్థిక మంత్రి బ్రుందంలో ఆర్ధిక, రెవెన్యూ కార్యదర్శి పాండే , ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, వ్యయ కార్యదర్శి మనోజ్ గోవిల్, పెట్టుబడులు, పబ్లిక్ అసెట్ మేనేజ్ మెంట్ కార్యదర్శి అరుణిష్ చావ్లా, ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు వంటి మేథావులు పలు రంగాలపై దృష్టి సారించారు. ముఖ్య ఆర్థిక సలహాదారునిగా వి అనంత్ నాగేశ్వరన్ ఉన్నారు. ఆర్థిక స్థితిని త్యాగం చేయకుండా వ్రుద్ధిని పెంచడం ఈ బ్రుందం ముందున్న అత్యంత కష్టమైన పని. పలు సవాళ్లు ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తిలో 4.5శాతానికి దిగువకు తీసుకురావాలనే ఆర్థిక లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని భావిస్తున్నారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాలు, వ్యయం, ఆర్థిక సేవలు DIPAM మరియు DPEలో 6 విభాగాలుఉన్నాయి. మంత్రిత్వ శాఖలో అత్యంత సీనియర్ బ్యూరో క్రాట్స్ ను ఆర్ధిక కార్యదర్శిగా నామినేట్ చేస్తారు. ఆర్ధిక, రెవెన్యూ కార్యదర్శి ఆయన పాండే అక్టోబర్ 2019నుంచి DIPAM కార్యదర్శిగా చేరినప్పటి నుంచి బడ్జెట్ తయారీ ప్రక్రియతో సంబంధం ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ 2021 నుంచి 4 బడ్జెట్ లను నిర్వహించిన ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెండవ అత్యంత సీనియర్ అధికారి. అతని డిపార్ట్ మెంట్ కింద ఉన్న బడ్జెట్ విభాగం మొత్తం బడ్జెట్ తయారీ ప్రక్రియను నిర్వహిస్తుంది.
Also Read: Gold Rates Rise: బంగారం కొనేవారికి నిర్మలమ్మ షాకింగ్ న్యూస్.. బడ్జెట్ వేళ కేంద్రం కీలక నిర్ణయం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.