Year ending 2021: డిసెంబర్​ 31 సమీపిస్తోంది.. ఈ పనులు పూర్తి చేశారా?

Year ending 2021: దాదాపు మరో వారం రోజుల తర్వాత 2022లోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే ఈ నెలాఖరులోపు పలు ఆర్థికపరమైన పనులు పూర్తి చేయాడం తప్పనిసరి. మరి పనులు ఏమిటి? వాటిని పూర్తి చేయకుంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? అనే వివరాలు మీకోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2021, 04:29 PM IST
  • ఈ నెలాఖరుతో ముగియనున్న ఐటీఆర్​ తుది గడువు
  • పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకూ 31 చివరి తేదీ
  • డిసెంబర్​ 31తో ముగియనున్న డీమ్యాట్​ కేవైసీ లాస్ట్ ఛాన్స్​
Year ending 2021: డిసెంబర్​ 31 సమీపిస్తోంది.. ఈ పనులు పూర్తి చేశారా?

Year ending 2021: కొత్త సంవత్సరం సమీపిస్తోంది. మరో వారం తర్వాత 2022లోకి అడుగు పెట్టబోతున్నాం.  అప్పుడే సెలెబ్రేషన్స్​పై కసరత్తు చేస్తున్నారు చాలా మంది. అయితే అంతకన్నా ముందు పూర్తి చేయాల్సిన కొన్ని ముఖ్యమైన ఆర్థికపరమైన పనులు ఉన్నాయి. డిసెంబర్ 31లోగా ఈ పనులను పూర్తి చేయకుంటే మీకు ఇబ్బందులు రావచ్చు. మరీ ఆ పనుల వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇన్​కం ట్యాక్స్ రిటర్న్ (ITR filing)​..

2021-22 రివ్యూ ఇయర్​కు గానూ ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేసేందుకు ఈ నెలాఖరు (డిసెంబర్ 31) చివరి తేదీ. కరోనా సహా వివిధ కారణాలతో ఇప్పటికే ఈ గడువును పలుమార్లు పెంచింది ఆర్థిక శాఖ. ఇప్పటికే గడువు చాలా సార్లు పెంచిన నేపథ్యంలో మరోసారి పెంచే యోచనలో ప్రభుత్వం లేదని అంచనాలు వస్తున్నాయి. కాబట్టి వీలైనంత త్వరగా ఇన్​కం ట్యాక్స్​ రిటర్ను ఫైల్ చేయడం ముఖ్యం. లేదంటే ఆలస్య రుసుము కింద రూ.5 వేల వరకు భారం పడొచ్చు.

లైఫ్ సర్టిఫికెట్ సమర్పించారా (Submitting Life Certificate)?

పెన్షనర్లు ప్రతి ఏటా.. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం తప్పనిసరి. పెన్షన్​దారు జీవించే ఉన్నట్లు నిర్ధారించుకునేందుకు ఉద్దేశించినదే ఈ లైఫ్​ సర్టిఫికెట్. పెన్షన్ తీసుకునే ఖాతా ఉన్న బ్యాంక్​లో లైఫ్​ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఎస్​బీఐ డోర్​స్టెప్​ లైఫ్​ సర్టిఫికెట్ సదుపాయాన్ని కూడా అదిస్తోంది. పోస్టాఫీసుల్లో కూడా లైఫ్​ సర్టిఫికెట్ సమర్పించొచ్చు.
నిజానికి నవంబర్​తో ఈ లైఫ్​ సర్టిఫికెట్​ సమర్పించేందుకు తుది గడువు ఉండగా.. దానిని డిసెంబర్​ 31కి పెంచారు. తాజాగా ఆ గడువు కూడా సమీపిస్తోంది. కాబట్టి పెన్షన్​దారులు వీలైనంత త్వరగా లైఫ్​ సర్టిఫికెట్ సమర్పించడం మేలు. లేదంటే వచ్చే నెల నుంచి పెన్షన్​ తీసుకోలేరు.

డీమ్యాట్ కేవైసీ (KYC Of Demat Accounts)..

ట్రేడింగ్ చేయాలంటే డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. ఇటీవల దేశంలో డీమ్యాట్​ ఖాతాలు విపరీతంగా పెరిగాయి. దీనితో డీమ్యాట్ ఖాతాదారులు కేవైసీ పూర్తి చేసేందుకు తొలుత నవంబర్ 30ను తుది గడువుగా పెట్టింది సెబీ. గత నెలాఖరులో ఈ గడువును డిసెంబర్ 31కి పెంచింది. కాబట్టి ఈ గడువులోగా కేవైసీ పూర్తి చేయాలి. లేదంటే డీమ్యాట్ ఖాతా క్లోజ్ అయ్యే అవకాశముంది.

ఆధార్​ యూఏఎన్​ లింక్​ (UAN link with Aadhar)

యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్​)ను ఆధార్​తో లింక్ చేయడం తప్పనిసరి చేస్తున్నట్లు ఈ ఏడాది తొలినాళ్లలోనే ప్రకటించింది ఈపీఎఫ్ఓ. కొవిడ్ కారణంగా ఈ గడువును పలుమార్లు పొడగించింది. అయితే ఈ గడువు ఏడు ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల ఈపీఎఫ్ఓ చందాదారులకు ఇదివరకే ఈ గడువు ముగిసింది. ఆయా రాష్ట్రాలకు చెందిన వారు గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే.. తమ సంస్థ జమ చేసే పీఎఫ్​ మొత్తం ఖాతాల జమ కాదు.

Also read: Stock Market today: వరుస లాభాలకు వారాంతంలో బ్రేక్​- సెన్సెక్స్​ 191 మైనస్​

Also read: Bank Holidays December 2021: ఆరు రోజులు మూతపడనున్న బ్యాంకులు.. ఏఏ రోజుల్లో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News