Cryptocurrencies ద్రవ్య వినిమయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చి సంచలనానికి మారు పేరుగా మారిన క్రిప్టో కరెన్సీ అందరి దృష్టిని ఆకర్శించింది. ఎంతో మంది క్రిప్టోలో భారీగా పెట్టుబడులు పెడితే ఎంతో మంది నిపుణులైన ఉద్యోగులు క్రిప్టోలో పనిచేసేందుకు బారులు తీరుతున్నారు. అటు పెట్టుబడికి ఆదాయాన్ని ఇటు ఉద్యోగానికి భారీగా జీతాలు ఇస్తూ అందరి మన్నలను పొందుతున్న క్రిప్టోకు కష్టాలు ప్రారంభమయ్యాయి. డిజిటల్ కరెన్సీపై అప్పుడే పెట్టుబడిదారులు అపనమ్మకాన్ని పెంచుకోవడంతో కొత్త పెట్టుబడులు రావడం లేదు. దీనికి తోడు చాలా మంది ట్రేడర్లు తమ పెట్టుబడులను క్రిప్టో నుంచి ఉపసంహరించుకోవడంతో క్రిప్టో మార్కెట్ వ్యాల్యూ రోజు రోజుకు పడిపోతోంది.
ఇలా పలు కష్టాలు ఎదుర్కొంటున్న క్రిప్టోను కొత్త సమస్య వెంటాడుతోంది. భారత్‌లో కూడా క్రిప్టోకు ఈకష్టాలు తప్పడం లేదు. క్రిప్టో లాభాలపై 30 శాతం పన్నును విధించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఇక ఈసారి భారీగా క్రిప్టో కరెన్సీలపై జీఎస్టీ వడ్డించేందుకు సిద్ధం అవుతోంది. క్రిప్టో కరెన్సీలపై ఏకంగా 28 శాతం జీఎస్టీ విధించాలని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా సంస్థలు కథనాలు కూడా ప్రచురిస్తున్నాయి. ముఖ్యంగా క్యాషినోలు, లాటరీలు, బెట్టింగ్ పై ఉన్నట్లుగానే క్రిప్టో పై కూడా భారీ ట్యాక్సులు ఉండాలని భావిస్తోందన సమాచారం.
ఈ మేరకు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తదుపరి జీఎస్టీ మీటింగ్ కల్లా ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపై కరెన్సీల కొనుగోళ్లు, అమ్మకాలపై 28 శాతం జీఎస్టీ వడ్డింపు తప్పదని సమాచారం. దీంతో పాటుగా క్రిప్టో ద్వారా కొనుగోలు చేసే ఆస్తులపై కూడా ఈ భారీ వడ్డింపు తప్పదని సమాచారం. జీఎస్టీకి అదనంగా 1 శాతం టీడీఎస్‌ను కూడా విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటికే విధిస్తున్న 30 శాతం పన్నుకు ఈ 28 శాతం జీఎస్టీ అనేది అదనపు వడ్డింపు అని సమాచారం. క్రిప్టో, డిజిటల్ రూపంలో ఇకపై ఇచ్చే బహుమతులకు ఈ ట్యాక్స్ వర్తిందని తెలుస్తోంది. ఈమేరకు ఈ నిబంధనలు అన్ని అమలు చేసేందుకు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ ‘115బీబీహెచ్’ను సవరణ చేయనున్నట్లు సమాచారం. డిజిటల్ కరెన్సీల పరోక్షంగా ఉగ్రవాదానికి, మనీ లాండరింగ్‌కు దోహదపడుతున్న నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
also read SBI FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులకు ఎస్బీఐ గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెంపు
also read Facebook Features: ఇక నుంచి Facebookలో ఈ 2 ఫీచర్లు పనిచేయవు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook