GST Collection November 2021: గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వం మరో మైలురాయిని చేరుకుంది. నవంబరు నెలకు గానూ ఏకంగా రూ.1.31 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో వసూలు చేసినట్లు కేంద్రం తెలిపింది. 2017 జులైలో జీఎస్‌టీని అమల్లోకి తెచ్చిన తర్వాత ఇదే రెండో అత్యధిక ఆదాయం కావడం విశేషం. అయితే జీఎస్టీ వసూళ్లలో గత ఐదు నెలల నుంచి రూ.లక్ష కోట్లకు పైగా ఆదాయం జీఎస్టీ రూపంలో కేంద్రప్రభుత్వానికి వచ్చి పడుతోంది.
ఈ నేపథ్యంలో జీఎస్టీల ద్వారా నవంబరు నెలకు గానూ.. రూ. 1,31,526 కోట్ల ఆదాయం వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలియజేసింది. అందులో సెంట్రల్ జీఎస్టీ (CGST) రూ.23,978 కోట్లు కాగా.. రాష్ట్రాల నుంచి వచ్చిన జీఎస్టీ (SGST) రూ.31,127 కోట్లు వసూలయ్యాయి. వీటితో పాటు ఐజీఎస్టీ (సమ్మిళిత జీఎస్టీ) కింద రూ.66,815 కోట్లు, సెస్ రూపంలో రూ.9,606 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
కరోనా సంక్షోభం తర్వాత గతేడాది నవంబరుతో పోలిస్తే.. ఈసారి నవంబరులో 25 శాతం జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లు తెలుస్తోంది. 2019 నవంబరుతో పోలిస్తే.. జీఎస్టీ ఆదాయం 27 శాతం వృద్ధి చెందినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. దేశంలో ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుందన్న దానికి ఇదే నిదర్శనమని స్పష్టం చేసింది.
ఆల్ టైమ్ రికార్డు వసూళ్లు
అక్టోబరు 2021లో జీఎస్‌టీ ద్వారా రూ.1,30,127 కోట్ల ఆదాయం సమకూరిన విషయం తెలిసిందే. 2021 ఏప్రిల్ నెలలో జీఎస్‌టీ వసూళ్లు ఆల్‌టైం రికార్డును తాకాయి. ఆ నెల రూ.1.41 లక్షల కోట్లు వసూలయ్యాయి.
Also Read: Gold Price Today: మరోసారి తగ్గిన బంగారం, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర
Also Read: Diamond Gold Umbrella: ఆ గొడుగు ఖరీదు ఎంతో తెలిస్తే...నోరెళ్లబెట్టాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook