LPG cylinder price: బడ్జెట్ కు ముందు ఉపశమనం..భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర

LPG cylinder price: బడ్జెట్ కు ముందు ప్రజలకు శుభవార్త. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి.   

Written by - Bhoomi | Last Updated : Feb 1, 2025, 08:42 AM IST
LPG cylinder price: బడ్జెట్ కు ముందు ఉపశమనం..భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర

 LPG cylinder price: బడ్జెట్ కు ముందు దేశ ప్రజలకు శుభవార్త. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 7 తగ్గించినట్లు ఇది ఫిబ్రవరి 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించాయి. 

తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1797కు చేరుకుంది. ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను రెస్టారెంట్లతోపాటు పలు వాణిజ్య కార్యకలాపాల కోసం వినియోగిస్తుంటారు. వీటి ధరలు తగ్గితే ఆయ చోట్ల ప్రజలకు కూడా కాస్త ఉపశమనం వచ్చే అవకాశం ఉంటుంది. 

అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు 14 కేజీ ధర మాత్రం మారలేదు. 2024 ఆగస్టు 1 నుంచి డొమెస్టిక్ సిలిండర్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. 

Also Read: Gold Rates Today: బడ్జెట్ కు ముందు రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం.. తులం రూ. 85వేలు  

గత కొంత కాలంగా 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరలను పెంచుతూ వస్తున్న చమురు మార్కెటింగ్ సంస్థలు సరిగ్గా బడ్జెట్ 2025కు ముందు ధరలను తగ్గించడం విశేషం. పేదలు, మధ్య తరగత వారిపై లక్ష్మీ దేవి కటాక్షం ఉండాలని ప్రధాని మోదీ శుక్రవారం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బడ్జెట్లో ప్రజలకు ఉపశమనం ఉంటుందన్న అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సిలిండర్ ధరలు కూడా దిగిరావడం మరింత సానుకూల అంశంగా చెప్పవచ్చు. 

హైదరాబాద్ లో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,023గా ఉంది. 14కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 855గా ఉంది. 

Also Read: Nara Lokesh: 'ఇది జగన్‌ ప్యాలెస్‌ కాదయ్యా.. ఎందుకింత బందోబస్తు'.. లోకేశ్‌ ఆన్‌ ద ఫైర్‌

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News