LPG Gas Cylinder Price Hike: సామాన్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మరో బిగ్ షాక్ తగిలింది. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేర్పులు జరిగాయి. దేశవ్యాప్తంగా ఉన్న చమురు కంపెనీలు కమర్షియల్ సిలిండర్ పై ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. సుమారు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.12 పెంచినట్లు కంపెనీలు పేర్కొన్నాయి. సిలిండర్ పై పెరిగిన ధరలు అతి త్వరలోనే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. పోయిన నెలలో కమర్షియల్ సిలిండర్ లపై రూ. 103 పెంచగా.. మరోసారి ఈరోజు ధరలు పెరగడంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడెక్కడ ఎంతెంత పెరిగాయంటే:
ఢిల్లీ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు రూ.12 అదనంగా పెరగడంతో ప్రస్తుతం రూ. 1,796.50 చేరుకున్నట్లు సమాచారం ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. పెరిగిన ధరలతో రూ. 2,024.4గా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 918.50కి విక్రయించగా మరికొన్నిచోట్ల ధరల్లో హెచ్చుతగ్గులతో లభిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం డొమెస్టిక్ సిలిండర్ ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే వీటి ధరలు అంతర్జాతీయ చమలు సంస్థలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ప్రతి నెల 1వ తేదీన ధరల్లో మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
ఇదిలా ఉండగా ఈరోజు భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఐదు పైసల చొప్పున తగ్గాయి. విజయవాడతోపాటు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.87 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ. 97.82 ఉన్నట్లు సమాచారం. ఇక హైదరాబాద్ విషయానికొస్తే..ఈరోజు వచ్చిన ధరల మార్పుల కారణంగా లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 ఉండగా.. డీజిల్ ధర రూ.97.82 ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొన్నిచోట్ల పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి రాలేనట్లు సమాచారం.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి