Visa Free Entry: పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో మలేషియా సరికొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది. ముఖ్యంగా విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు వీసా ఫ్రెండ్లీ కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు కొత్తగా భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తోంది.
ఇండియాతో పాటు పలు దేశాల పర్యాటకుల్ని ఆకర్షించేందుకు మలేషియా వీసా కార్యక్రమంలో మార్పులు చేసింది. భారతదేశం సహా కొన్ని దేశాల్నించి వచ్చే ప్రయాణీకులకు వీసా ఫ్రీ ఎంట్రీ ప్రకటించింది. ఆ దేశంలోని పర్యాటకాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియా, చైనా నుంచి వచ్చే ప్రయాణీకులకు 30 రోజుల వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నట్టు మలేషియా ప్రదానమంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రకటించారు. ప్రపంచ పర్యాటకులకు మలేషియా పర్యటన సులభతరం చేయనుంది ఈ నిర్ణయం.
ఇండియా, చైనా పర్యాటకులకు మలేషియాలో 30 రోజుల వీసా ఫ్రీ ఎంట్రీ డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే ఈ రెండు దేశాల పర్యాటకులు మలేషియా వెళ్లాలంటే వీసా అవసరం లేదు. దీనివల్ల ఎలాంటి అంతరాయం లేకుండా ఆ దేశానికి వెళ్లవచ్చు. ఫలితంగా మలేషియా పర్యాటకం, మలేషియా ఆర్ధిక వ్యవస్థ మరింత బలోపేతం కావచ్చు. దీనికోసం కావల్సిందల్లా పాస్‌పోర్ట్, రిటర్న్ టికెట్ ప్రూఫ్, మలేషియా ఇమ్మిగ్రేషన్ నుంచి హోటల్ బుకింగ్ ఉండాలి.
ఇప్పటికే భారతదేశ పర్యాటకులకు థాయ్‌లాండ్, శ్రీలంక దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ రెండు దేశాల సరసన ఇప్పుడు మలేషియా చేరింది. దాయ్‌లాండ్ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు భారతీయులకు వచ్చే ఏడాది మే వరకూ వీసా ప్రీ ఎంట్రీ కల్పించింది. ఇక శ్రీ లంక కూడా పైలట్ ప్రాజెక్టులో బాగంగా చైనా, ఇండియా, రష్యా, జపాన్, మలేషియా, ఇండోనేషియా, ధాయ్‌లాండ్ దేశాలకు వచ్చే ఏడాది మార్చ్ 31 వరకూ వీసా ఫ్రీ ఎంట్రీ కల్పించింది.
త్వరలో వియత్నాం దేశం కూడా పర్యాటకుల్ని ఆకర్షించేందుకు వీసా ఫ్రీ ఎంట్రీ కల్పించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం వియత్నాంలో వీసా ఫ్రీ ఎంట్రీ కేవలం యూరోపియన్ దేశాలకే ఉంది. త్వరలో భారతదేశం సహా ఇతర దేశాలకు కూడా వర్తించవచ్చు. కోవిడ్ 19 మహమ్మారి ప్రభావం నుంచి కోలుకున్న తరువాత అన్ని దేశాలు పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. మలేషియా, శ్రీలంక, ధాయ్‌లాండ్ దేశాల వీసా ఫ్రీ ఎంట్రీ నిర్ణయం వల్ల ఆయా దేశాల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడనున్నాయి. పర్యాటకం కచ్చితంగా వృద్ధి చెందనుంది.
Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు చేసిందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook