New Maruti Swift: కొత్త మారుతి స్విఫ్ట్ లాంచ్, ఏ వేరియంట్ ధర ఎంతంటే

మారుతి కారు అంటే దేశ ప్రజలకు ఓ నమ్మకం. మారుతి నుంచి ఏ మోడల్ మార్కెట్ లోకి వచ్చినా ఆదరణ ఎక్కువే ఉంటుంది. మారుతి కంపెనీకు చెందిన ఎవర్ గ్రీన్ మోడల్స్‌లో ఒకటి మారుతి స్విఫ్ట్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 11, 2024, 04:25 PM IST
New Maruti Swift: కొత్త మారుతి స్విఫ్ట్ లాంచ్, ఏ వేరియంట్ ధర ఎంతంటే

మారుతి కంపెనీ కార్లతో అత్యధికంగా విక్రయమయ్యే మోడల్స్ లో ఒకటి మారుతి స్విఫ్ట్. మారుతి కార్లలో ఇదొక ఎవర్ గ్రీన్ మోడల్. ప్రతి యేటా మారుతి స్విఫ్ట్ అమ్మకాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మారుతి కంపెనీ నుంచి కొత్త స్విఫ్ట్ లాంచ్ అయింది. మార్కెట్ లో ఇప్పుడీ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

మారుతి సుజుకి లాంచ్ చేసిన కొత్త మారుతి స్విఫ్ట్ 4వ జనరేషన్ కు చెందింది. ఇందులో మొత్తం ఐదు వేరియంట్లు ఉన్నాయి. అవి LXi, VXi, VXi(o),ZXi, ZXi Plusగా ఉన్నాయి. ఈ కారు ధర 6.49 లక్షల నుంచి ప్రారంభమై 9.64 లక్షల వరకూ ఉంటుంది. ఇందులో 6 మోనోటోన్, 3 డ్యూయల్ టోన్ రంగులున్నాయి. వీటిలో నావెల్ ఆరెంజ్, మేగ్మా గ్రే, సిజ్లింగ్ రెడ్, లస్టర్ బ్లూ, పర్ల్ ఆర్కిటిక్ వైట్, స్ప్లెండిడ్ సిల్వర్, లస్టర్ బ్లూ ప్లస్ మిడ్ నైట్ బ్లాక్ రూఫ్, సిజ్లింగ్ రెడ్ ప్లస్ మిడ్ నైట్ బ్లాక్ రూఫ్, పర్ల్ ఆర్కిటిక్ వైట్ ప్లస్ మిడ్ నైట్ బ్లాక్ రూఫ్ ఉన్నాయి. కొత్త మారుతి స్విఫ్ట్ వివిధ వేరియంట్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

New Maruti Swift LXi MT- 6,49,000 రూపాయలు
New Maruti Swift VXi MT- 7,29,500 రూపాయలు
New Maruti Swift VXi AMT- 7,79,500 రూపాయలు
New Maruti Swift VXi (O) MT- 7,56,500 రూపాయలు 
New Maruti Swift VXi (O) AMT- 8,06,500 రూపాయలు
New Maruti Swift ZXi MT- 8,29,500 రూపాయలు
New Maruti Swift ZXi AMT- 8,79,500 రూపాయలు
New Maruti Swift ZXi (O) MT- 8,99,500 రూపాయలు
New Maruti Swift ZXi (O) AMT- 9,49,500 రూపాయలు 
New Maruti Swift ZXi+ Dual-Tone MT- 9,14,500 రూపాయలు
New Maruti Swift ZXi+ Dual-Tone AMT- 9,64,500 రూపాయలు

Also read: Jio OTT Plans: జియోలో ఈ ప్లాన్ తీసుకుంటే అమెజాన్, నెట్ ఫ్లిక్స్ సహా 15 ఓటీటీలు ఉచితం

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News