Best Investment Scheme: దంపతులకు శుభవార్త.. మీ భార్య పైన అకౌంట్ తెరిస్తే రూ.45 వేలు సొంతం..!

Best Pension Scheme: మీరు ప్రతి నెల 45 వేల రూపాయలను పెన్షన్ గా పొందాలి అనుకుంటే,  ఎన్ పి ఎస్ సిస్టమ్స్ స్కీమ్ లో మీ భార్య పేరు పైన ఇప్పటి నుంచి 5000 రూపాయలు జమ చేయడం మొదలుపెడితే,  మీ భార్య కి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమెకు జీవితాంతం ప్రతినెల రూ.45,000 పెన్షన్ లభిస్తుంది

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 29, 2024, 07:37 PM IST
Best Investment Scheme: దంపతులకు శుభవార్త.. మీ భార్య పైన అకౌంట్ తెరిస్తే రూ.45 వేలు సొంతం..!

Pension Scheme for Married Couple: మీకు పెళ్లయిందా.. అయితే మీకు ఒక శుభవార్త.. ఇలా చేస్తే రూ.45,000 మీ సొంతమవుతుంది. అంతేకాదు ప్రతి నెల కూడా మీరు ఇదే మొత్తం పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. 

భవిష్యత్తులో డబ్బు కోసం మీ భార్య ఇంకొకరి పైన ఆధారపడకూడదు అంటే మీరు ఇప్పటి నుంచే ఆమెకు రెగ్యులర్ ఆదాయాన్ని ఏర్పాటు చేయాలి.. దీని కోసం మీరు మీ భార్య పైన నేషనల్ పెన్షన్ సిస్టం స్కీమ్ లో ఖాతా తెరిస్తే , మీ భార్యకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమెకు భారీ మొత్తం లభిస్తుంది. ఈ పెన్షన్ ప్రయోజనం మీకు ప్రతి నెల లభిస్తుంది. ముఖ్యంగా ఎన్పిఎస్ ఖాతా అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ప్రతి నెల కూడా మీరు ఎంత పెన్షన్ కావాలో స్వయంగా మీరు నిర్ణయించుకోవచ్చు. 

దీని ద్వారా మీ భార్యకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. ఇందులో ఖాతా ఎలా తెరవాలి అంటే.. దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ ఖాతా మీరు తెరవవచ్చు .ఎన్పీఎస్ ఖాతా 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మెచ్యూర్ అవుతుంది. కొత్త నిబంధన ప్రకారం ఎవరైనా కావాలనుకుంటే 65 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చ.

ప్రతి నెల 5000 రూపాయలను పెట్టుబడిగా పెడితే , రూ.1.12కోట్ల ఫండ్ లభిస్తుంది. మీ భాగస్వామి వయసు 30 సంవత్సరాలు అయినప్పుడు ఎన్పీఎస్ ఖాతాలో ఆమె పేరు చేర్చి ప్రతినెల 5000 రూపాయలను పెట్టుబడిగా పెట్టాలి. పెట్టుబడికి 10% వార్షిక రాబడి లభిస్తే 60 సంవత్సరాల లో ఆమె ఖాతాలో రూ.1.12 కోట్లు ఉంటాయి. దీని నుంచి దంపతులకు ప్రతినెల 45 వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది.  ఈ పెన్షన్ వారికి జీవితాంతం అందుతూనే ఉంటుంది. 

రిటైర్మెంట్ తర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు అని భావించేవారు ఈ స్కీం కింద ఖాతా తెరవడం ఉత్తమమైన పద్ధతి. కాబట్టి ఇప్పుడే మీ భార్య పేరు పైన ఖాతా తెరిచి ఆర్థిక ఇబ్బందులకు చెక్ పెట్టండి.

Also Read: Big Shock To YSRCP: జగన్‌కు షాక్‌ల మీద షాక్‌.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా

Also Read: Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News