Oppo India evaded custom duty worth rs 4389 crores: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ అనుబంధ సంస్థ 'ఒప్పో' పన్ను ఎగవేతకు సంబంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒప్పో కంపెనీ భారత్‌లో కస్టమ్స్ డ్యూటీ ఎగవేసినట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఒప్పో సంస్థకు జులై 8న రూ.4,389 కోట్లు విలువ చేసే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తాజాగా తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది. భారత్‌లో ఒప్పో, వన్‌ప్లస్, రియల్‌మీ పేరిట మొబైళ్లను విక్రయిస్తోన్న విషయం తెలిసిందే.
మనీలాండరింగ్, పన్ను ఎగవేత ఆరోపణలపై ఒప్పో ఇండియాకు చెందిన ఆఫీసులు, ఎగ్జిక్యూటివ్ నివాసాల్లో ఇటీవల డీఆర్‌ఐ అకస్మాత్తు సోదాలు చేపట్టింది. ఆ సోదాలలో దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువుల వివరణలో ఉద్దేశ పూర్వకంగానే తప్పుడు ప్రకటన చేసినట్టు తేలింది. పన్ను మినహాయింపు ఉన్న కేటగిరీలో తప్పుగా చూపించి రూ.2,981 కోట్ల లబ్ధి పొందినట్లు డీఆర్‌ఐ తెలిపింది. రాయల్టీ, లైసెన్స్ ఫీజులకు సంబంధించిన నిబంధనల్ని ఉల్లఘించడం ద్వారా ఇంకో రూ.1,408 కోట్ల ప్రయోజనం పొందినట్లు వెల్లడించింది.
ఒప్పో ఇండియా తాము చెల్లించిన దిగుమతి సుంకం తగ్గినట్లు పేర్కొని.. ముందుగానే రూ.450 కోట్లు డిపాజిట్ చేయడం విశేషం. ఈ నేపథ్యంలో రూ.4,389 కోట్ల దిగుమతి సుంకాన్ని చెల్లించాలని డీఆర్‌ఐ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు పలు సెక్షన్లను ఉల్లంఘించినందుకు జరిమానా కూడా విధించింది. ఇటీవల చైనాకు చెందిన మరో కంపెనీ 'వివో' ఆఫీసులు, యూనిట్లపై ఏకకాలంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులకు దిగింది. 2017-21 మధ్య కాలంలో రూ. 62,476కోట్ల టర్నోవర్‌ను చైనాకు తరలించిందని తేలింది.
Also Read: Janhvi-Sara: హాట్ హాట్‌గా జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్.. ముద్దుగుమ్మలు ఒకరినికోరు పట్టుకుని..!
Also Read: Rohit Sharma Six: రోహిత్ శర్మ భారీ సిక్సర్.. చిన్నారికి తప్పిన పెను ప్రమాదం (వీడియో)!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook