PM Internship Scheme Launching Today: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఉపాధి, నైపుణ్య శిక్షణ కోసం పీఎం ఇంటర్న్ షిప్ పేరిట సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. గతంలో బడ్జెట్లో పేర్కొన్న విధంగానే పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ నేడు అధికారిక లాంఛనాలతో ప్రారంభించింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఒక పోర్టల్‌ను సైతం తయారుచేసింది. పలు కంపెనీలు ఈ పోర్టల్ ద్వారా అభ్యర్థుల నుండి దరఖాస్తులను పొందవచ్చు, అర్హులైన ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోర్టల్ ద్వారా అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోర్టల్ అభ్యర్థులకు అక్టోబర్ 12 నుండి అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, అభ్యర్థులు ఈ పోర్టల్ ద్వారా అన్ని రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు ఒక ఫారమ్‌ను పూరించాలి, అందులో వారు తమ నైపుణ్యాల గురించి సమాచారాన్ని అందించాలి.
మీరు ఏ కంపెనీకి సరైనవారు అది మీ CVని ఆటోమేటిగ్గా సిద్ధం చేస్తుంది. ఇంటర్న్‌షిప్‌లో ఆసక్తి ఉన్న అభ్యర్థులు వారి ప్రొఫైల్, ప్రాధాన్యతలు అర్హత ఆధారంగా ఎంపిక అవుతారు. దీని తర్వాత, పథకంలో పాల్గొనే కంపెనీలు వాటిలోని అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. అప్రెంటిస్ భాగస్వామ్యానికి అభ్యర్థుల అర్హతకు సంబంధించి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను కూడా ఇప్పటికే విడుదల చేసింది.
జులై బడ్జెట్‌లో కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్ మహీంద్రా ఈ పథకంపై తమ ఆసక్తిని కనబరిచాయి. ఐదేళ్లలో కోటి మందికి శిక్షణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: Money Tips: పావు ఎకరం ఉంటే చాలు.. ఏడాది రూ. 10లక్షలు వెనకేసుకోవచ్చు..ఏం చేయాలంటే?
దీని కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు :
దరఖాస్తుదారులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి వారి వయస్సు 21 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగంలో ఎవరూ ఉండకూడదు. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు. మీరు ఏదైనా పూర్తి సమయం కోర్సు లేదా ఉద్యోగంతో ఇంటర్న్‌షిప్ చేయలేరు. ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్ వంటి విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు దీనికి దరఖాస్తు చేసుకోలేరు.
ఎంత స్టైఫండ్ పొందుతారు :
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఇంటర్న్ షిప్ స్కీమ్ లో దేశంలోని టాప్ 500 కంపెనీల్లో దాదాపు కోటి మందికి ఇంటర్న్ షిప్ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పని చేస్తోంది. అంతేకాదు ఇంటర్న్ షిప్ అలవెన్స్ కింద ప్రతినెల 5000 రూపాయలు ప్రతి విద్యార్థి పొందుతాడు. దీంతోపాటు కార్పొరేట్ కంపెనీలు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ద్వారా ఇంటర్షిప్ ఖర్చులో 10% భరించాల్సి ఉంటుంది ఈ స్కీం ద్వారా యువత నైపుణ్యాలను పొందే అవకాశం ఉంటుంది. తద్వారా వీరు చిన్న మధ్యతరహ పరిశ్రమలు ఉపాధి పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి