RBI Allows Pre Sanctioned Credit Line: ప్రస్తుతం మన దేశంలో యూపీఐ పేమెంట్స్ ఏస్థాయిలో జరగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న బడ్డీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు యూపీఐ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యూపీఐ సదుపాయలను కూడా పెంచుతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తాజాగా మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రీ-మంజూరైన క్రెడిట్ లైన్‌లను కూడా యూపీఐ ద్వారా చెల్లించవచ్చని వెల్లడించింది. ప్రస్తుతం ప్రీ అప్రూవ్డ్ లోన్స్ క్యాష్‌ను యూపీఐ ద్వారా చెల్లించే అవకాశం లేదు. ఇక నుంచి ఈ డబ్బులను కూడా యూపీఐ ద్వారా చెల్లించే సదుపాయం కల్పించింది ఆర్‌బీఐ.
ఇప్పటివరకు యూపీఐ సిస్టమ్ మన బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ అయిన డబ్బులను మాత్రమే లావాదేవీలు చేసేందుకు వీలుండేంది. ప్రస్తుతం సేవింగ్స్ ఖాతాలు, ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్లు, ప్రీపెయిడ్ వాలెట్లు, క్రెడిట్ కార్డ్‌లను యూపీఐకి లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఇక నుంచి యూపీఐకి బ్యాంకులు జారీ చేసే ప్రీ అప్రూవ్డ్ లోన్ సదుపాయాలను చేర్చడం ద్వారా కస్టమర్‌లు మరింత ప్రయోజనం చేకూరుతుందని ఆర్‌బీఐ తెలిపింది. యూపీఐ పేమెంట్స్ మరింత పెరుగుతాయని పేర్కొంది.
ఈ ఏడాది ఏప్రిల్ 6న బ్యాంకుల నుంచి ముందుగా మంజూరు అయిన క్రెడిట్ లైన్‌ల నుంచి బదిలీని ప్రారంభించి.. యూపీఐ ఇంటర్‌ఫేస్ పరిధిని విస్తరించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. బ్యాంకుల్లో ఇప్పటికే ఆమోదించిన లోన్ సదుపాయాన్ని టాన్స్‌ఫర్ చేయడానికి ఆమోదించాలని సూచించింది. అంటే ముందుగా ప్రీ అప్రూవ్డ్ లోన్స్‌ను ఎవరికైనా బదిలీ చేయవచ్చు.
"ఈ సదుపాయం కింద వ్యక్తిగత కస్టమర్ ముందస్తు అనుమతితో.. వ్యక్తులకు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ జారీ చేసిన ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ ద్వారా చెల్లింపులను యూపీఐ సిస్టమ్‌ను ఉపయోగించి లావాదేవీలకు ప్రారంభించవచ్చు. ఇతర అంశాలతోపాటు క్రెడిట్ పరిమితి, క్రెడిట్ వ్యవధి, వడ్డీ రేటు మొదలైనవి ఉండవచ్చు" అని ఆర్‌బీఐ తెలిపింది. ఇక ఆర్‌బీఐ నిర్ణయంపై యూపీఐ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం మన దేశంలో రిటైల్ డిజిటల్ చెల్లింపుల పరిమాణంలో 75 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ఆగస్టు నెలలో యూపీఐ లావాదేవీలు 10 బిలియన్ల మార్కును అధిగమించాయి. జూలైలో యూపీఐ లావాదేవీల సంఖ్య 9.96 బిలియన్లుగా ఉంది. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.. దేశంలో డిజిటల్ చెల్లింపులకు యూపీఐ వెన్నెముకగా నిలిచిందని అన్నారు. యూపీఐ ద్వారా బ్యాంకింగ్ సౌకర్యాలు కూడా లేని మిలియన్ల మంది ప్రజలకు ఆర్థిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
Also Read: Nandamuri Kalyan Ram: కళ్యాణ్ రామ్ 'డెవిల్' మూవీ కోసం భారీ సెట్స్.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా..!
Also Read: Jasprit Bumrah Blessed With Baby Boy: తండ్రైన బుమ్రా.. కుమారుడికి డిఫరెంట్ పేరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి