SBI credit cards EMIs would be subject to a processing fee as well as tax: మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌పై ఈఎంఐలు ఇకపై మరింత భారం కానున్నాయి. ఈఎంఐ లావాదేవీలపై ప్రాసెంసింగ్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (SBICPSL) తాజాగా ప్రకటించింది.
కొత్త ఛార్జీల పూర్తి వివరాలు..
ఈఎంఐ లావాదేవీలపై రూ.99 ప్రాసెసింగ్ ఫీజు కింద వసూలు చేయనున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. దీనికి అదనంగా ట్యాక్సులు కూడా వర్తించనున్నాయని తెలిపింది.
ఈ కొత్త ఛార్జీలు వచ్చే నెల (డిసెంబర్ 1) నుంచే అమలులోకి రానున్నాయి పేర్కొంది ఎస్బీఐ కార్డ్స్.
Also read: 10 digit Mobile Number: అవును.. ఫోన్ నంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుంది..? పదండి తెలుసుకుందాం
అన్నింటికీ ఛార్జీల వర్తింపు..
ఎస్బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో.. డిసెంబర్ 1 నుంచి జరిపే ఈఎంఐ లావాదేవీలపై ఛార్జీలు వర్తించనున్నాయి.
ఈ-కామర్స్ వెబ్సైట్లతో పాటు.. ఆఫ్‌లైన్‌లో ఈఎంఐ ఆప్షన్‌తో చేసే కొనుగోళ్లన్నింటికి ఈ ఛార్జీలు వర్తిస్తాయన్నమాట. ఇంతకు ముందు ఇలాంటి ఛార్జీలు ముందు కొనుగోలు చేసి.. తర్వాత ఈఎంఐకి కన్వర్షన్ చేసుకున్నప్పుడు మాత్రమే వర్తించేవి.
ఒక వేళ ఈఎంఐ రద్దయితే ఆ ఛార్జీలను రీఫండ్ చేయనున్నట్లు ఎస్బీఐ పేర్కొంది.
Also read: Tips For reduce Expenses: ఈ టిప్స్‌తో అనవసర ఖర్చులకు చెక్ పెట్టండి!
Also read: Rakesh Jhunjhunwala: ఆకాశ ఎయిర్ నుంచి బోయింగ్‌కు రూ.75 వేల కోట్ల ఆర్డర్?
ఈఎంఐ మొత్తంతో సంబంధం లేదు..
అయితే ఈఎంఐ మొత్తానికి ప్రాసెసింగ్ ఫీజుకు సంబంధం లేదని ఎస్బీఐ కార్డ్స్ స్పష్టతనిచ్చింది. అంటే.. మీరు కొనే వస్తువుపై ఈఎంఐ ఎంత తక్కువగా ఉన్నా.. ఎంత ఎక్కువగా ఉన్నా దానిపై ప్రాసెసింగ్ ఫీజు రూ.99స(పన్నులు అదనం) మాత్రమే వసూలు చేయనున్నట్లు పేర్కొంది.
పండుగల వంటి సమయాల్లో జీరో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని ఇస్తుంటారు. అయితే ఆ ఆఫర్లు ఉన్నా.. ఛార్జీలు తప్పనిసరి అని వివరించింది ఎస్బీఐ కార్డ్స్.
Also read: PNB reduces interest rates: పీఎన్బీ ఖాతాదారులకు షాక్- సేవింగ్స్ ఖాతాల వడ్డీకి కోత
Also read: Equity Mutual Funds: ఈక్విటీ మార్కెట్‌లో పురోగతి, భారీగా పెట్టుబడులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook