AC and Cooler is not needed in Summer If you buy Water Sprinkler Fan: మరికొద్ది రోజుల్లో చలికాలం ముగియబోతోంది. ప్రస్తుతం చలికాలం అయినా మధ్యాహ్నానికి ఎండ తీవ్రతకు వేసవి కాలం ఫీలింగ్ వచ్చేస్తుంది. మరోకొద్ది రోజులు పొతే ఉదయం మరియు రాత్రి పూట కూడా వేడిగా ఉంటుంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక చాలా మంది ఏసీ, కూలర్లను వాడతారు. ఈసారి చలి ఎలా ఉందో.. వేడి కూడా అదే స్థాయిలో ఉండబోతోంది. దాంతో ఏసీ, కూలర్ రన్ చేయడం వల్ల కరెంటు బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది. అయితే తక్కువ విద్యుత్ వినియోగంలో ఏసీ లాంటి చల్లదనాన్ని అందించే ఫ్యాన్ కూడా ఉంది. ధర కూడా చాలా తక్కువ.
వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్:
ఏసీ లాంటి చల్లదనాన్ని అందించే ఫ్యాన్.. టేబుల్ ఫ్యాన్ లేదా సీలింగ్ ఫ్యాన్ కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. ఇది నీటి సాయంతో చల్లటి గాలిని ఇస్తుంది. ఈ ఫ్యాన్‌ని 'వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్' (Water Sprinkler Fan) అంటారు. వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్.. గాలి మరియు వాటర్ స్ప్లాష్ ద్వారా మీకు చల్లని గాలిని అందిస్తుంది. మీరు పెళ్లిలో లేదా పార్టీలో చూసిన ఫ్యాన్ మాదిరిగానే ఉంటుంది.
వేడి గాలిని చల్లబరుస్తుంది:
మార్కెట్లో అనేక రకాల వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని చిన్నవిగా, మరికొన్ని పెద్దవిగా ఉన్నాయి. అంతేకాదు కొన్ని కొన్ని చౌకగా మరియు మరికొన్ని ఖరీదైనవిగా ఉన్నాయి. ఇది మంచి కూలింగ్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ నీటి సాయంతో వేడి గాలిని చల్లబరుస్తుంది. దీన్ని ఇంటి లోపల లేదా వెలుపల ఉపయోగించవచ్చు.
పనిచేయు విధానం:
వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్.. వాటర్ ట్యాప్‌కు కనెక్ట్ చేయాలి. ఫ్యాన్ ముందు భాగంలో (చక్రాలు తిరిగే భాగంలో) చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. నీటి కుళాయిని ఆన్ చేసిన తర్వాత.. ఫ్యాన్‌ను ఆన్ చేయాలి. అప్పుడు నీటి స్ప్లాష్తో బలమైన గాలిని ఇస్తుంది. మీరు ఫ్యాన్ వేగాన్ని కూడా సర్దుబాటు చేసుకోవచ్చు.
ఫ్యాన్ ధర:
వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్ ధర రూ. 6875. అయితే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో కేవలం రూ. 1375కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్యాన్‌పై అమెజాన్‌లో 80% తగ్గింపు ఉంది. ఫ్యాన్‌లో ఏడు మీటర్ల పైపు, ట్యాప్ కనెక్టర్ కూడా వస్తాయి.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ మరింత దూకుడుగా ఆడాలి.. మాజీ ప్లేయర్ సూచన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.