Adivi Sesh HIT 2 : అమ్మ అడివి శేషు.. ఇదా సీక్రెట్!.. నిజాయితీగా బయటపెట్టేసిన హీరో

Adivi Sesh Speech అడివి శేష్ హిట్‌ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం నాడు గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో అడివి శేష్ మాట్లాడిన మాటలు, ఇచ్చిన స్పీచు వెనుకున్న సీక్రెట్ అందరికీ తెలిసిపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2022, 10:14 AM IST
  • డిసెంబర్ 2న రాబోతోన్న హిట్ 2
  • ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్టుగా నాని
  • అడివి శేష్ స్పీచ్ సీక్రెట్ ఇదే
Adivi Sesh HIT 2 : అమ్మ అడివి శేషు.. ఇదా సీక్రెట్!.. నిజాయితీగా బయటపెట్టేసిన హీరో

Adivi Sesh HIT 2 అడివి శేష్ హిట్ 2 సినిమా డిసెంబర్ 2న థియేటర్లోకి రాబోతోంది. ఈక్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఈవెంట్‌కు రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చాడు. ఇక విశ్వక్ సేన్ సైతం వచ్చాడు. హిట్ ఫ్రాంచైజ్‌లో తాను ఉంటానో లేదో అని కూడా అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఈ ఈవెంట్‌కు రాజమౌళి రావడం, మొదటి పార్ట్‌కు కూడా ఆయనే వచ్చారంటూ విశ్వక్ సేన్ గుర్తు చేశాడు.

అడివి శేష్ అయితే తన స్పీచును ఎలా ఇవ్వాలో చేతి మీద రాసుకొచ్చాడట. ఈ విషయాన్ని స్టేజ్ మీదే చెప్పాడు. టెన్షన్‌తో మరిచిపోతానేమో అని, చేతి మీద రాసుకొచ్చాను అంటూ అడివి శేష్‌ చెప్పి తన స్పీచ్‌ను కంటిన్యూ చేశాడు. అయితే అడివి శేష్ మాత్రం తాను చేతి మీద రాసుకున్నట్టుగానే చెప్పుకొచ్చాడు. అడివి శేష్ చేతి మీద ఏం రాసి ఉందో ఓ సారి చూద్దాం. పాయింట్ల పరంగా అడివి శేష్ ఇలా రాసుకొచ్చాడు.

 

గెస్ట్స్ అచ్చీవ్మెంట్స్, బాహుబలి వర్క్ ఎక్స్ పీరియెన్స్, నేర్చుకున్న విషయాలేంటి.. రాజమౌళితో ఎలాంటి అనుభవం ఏర్పడింది.. లాస్ ఏంజిల్స్‌లో ఉన్న సమయం గురించి.. నమ్మకం అని ఇంకా ఏదో రాసుకున్నాడు అడివి శేష్. ఆడియెన్స్ నమ్మకం, సినిమాలోని ట్విస్టులను రివీల్ చేయకూడదు.. డిసెంబర్ 2న హిట్ 2.. హిందీలోనూ హిట్ రానుంది అంటూ ఇలా పాయింట్ల పరంగా అడివి శేష్ తన చేతి మీద రాసుకున్నాడు.

ఇది చూసిన నెటిజన్లు అమ్మ అడివి శేష్.. నువ్వు కూడా మాలానే.. అని కొందరు అంటే.. నువ్వు నేను సినిమాలోని ధర్మవరపు సుబ్రహ్మణ్యం దయానంద్ సీన్‌ను గుర్తు చేస్తున్నారు. మొత్తానికి అడివి శేష్ మాత్రం ఈ ట్వీట్‌తో అందరినీ నవ్వించేస్తున్నాడు.

Also Read : Upasana Konidela : గుడ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు.. కొత్త ఆరంభం అంటూ ఉపాసన పోస్ట్

Also Read : Ananya Panday latest Pics : అదరహో అనిపిస్తోన్న అనన్య.. పిచ్చెక్కిస్తోన్న లైగర్ పోరి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News