Kannappa: శివుడి అవతారంలో బాలీవుడ్ హీరో .. కన్నప్ప నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్..

Akshay kumar lord shiva look: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా కన్నప్పను నిర్మిస్తున్నారు.ఈ మూవీ నుంచి శివుడి అవతారం పొస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 20, 2025, 02:11 PM IST
  • కన్నప్ప నుంచి మరో బిగ్ అప్ డేట్..
  • బాలీవుడ్ హీరో కొత్త అవతారం..
Kannappa: శివుడి అవతారంలో బాలీవుడ్ హీరో .. కన్నప్ప నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్..

akshay kumar as lord shiva look in kannappa movie: మంచు విష్ణు ఒక వైపు కుటుంబ గొడవలతో సతమతమౌతున్నాడు. అదే విధంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ లో కన్నప్ప విషయంలో ఏ మాత్రం తగ్గెదెలా అన్నవిధంగా ముందుకు వెళ్తున్నారు.ఈ క్రమంలో ఈ మూవీ నుంచి బిగ్ అప్ డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాను, ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. బాలీవుడ్ హీరో  అక్షయ్‌ కుమార్‌.. కన్నప్పలో శివుడిలా కన్పించనున్నారు.

 

ఈ నేపథ్యంలో మూవీ తాజాగా.. శివుడి అవతారంలో ఉన్న  అక్షయ్‌ కుమార్‌ పోస్టర్ ను రిలీజ్ చేసింది.  కన్నప్ప మూవీ ఎక్కువగా న్యూజిలాండ్ లో షూటింగ్ ను నిర్వహించారు. ఇది మూడో శతాబ్దంనాటి స్టోరీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావడంతో.. లోకేషన్ విషయంలో మూవీ టీమ్ కావాలని కొన్ని ప్రదేశాలను ఎంచుకున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. అంతే కాకుండా.. ఈ మూవీ భారీ బడ్జెత్ తో రూపొందిస్తున్నారు. 

 ఈ సినిమాలో నార్త్‌ టు సౌత్‌ ..అనేక మంది హీరో, హీరోయిన్ లు ఇందులో భాగమౌతున్నారు. 'మహాభారత్​' సిరీస్‌ తెరకెక్కించిన .. ముఖేశ్ కుమార్‌ సింగ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీతి ముకుందన్‌ హీరోయిన్​ గా  నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ మేకర్స్ పార్వతీ పోస్టర్ ను రిలీజ్ చేశారు .

పార్వతి పాత్రలో..కాజల్ అగర్వాల్ కన్పించారు. అయితే.. పార్వతి మరీ మోడ్రన్ పార్వతిలా ఉన్నారని.. కనీసం కుంకుమ కూడా లేదని, ఈ పోస్టర్ వివాదంగా మారింది. మరోవైపు.. కన్నప్ప మూవీ టీమ్.. శివుడి కొత్త పోస్టర్‌ రిలీజ్ చేసింది. ఇందులో త్రిశూలం, ఢమరుకంతో అక్షయ్ కుమార్ కన్పిస్తున్నారు.

Read more:  Saif Ali khan: సైఫ్ అలీఖాన్‌ఫై దాడి.. ఈ చిన్న తప్పు వల్ల అడ్డంగా దొరికిపోయిన నిందితుడు..

ఈ  నేపథ్యంలో శివయ్య లుక్ లో.. అక్షయ్ అదిరిపోయేలా కన్పిస్తున్నారని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. తొలుత ఈ మూవీలో శివపార్వతుల్లా..  ప్రభాస్ , నయనతారలను అనుకున్నారని టాక్ నడించింది. కానీ అనూహ్యంగా.. కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ శివపార్వతుల్లా కన్పించారు. ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News