Chiranjeevi: చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా తన ఓన్ బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్‌లో రామ్ చరణ్ నిర్మాతగా వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ తన సొంత బామ్మర్ధి అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్‌లో ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. గతంలో చిరంజీవికి తన తమ్ముడు నాగబాబుతో తల్లి పేరుతో అంజనా ప్రొడక్షన్స్ స్థాపించి అందులో వరుసగా సినిమాలు చేసాడు. అందులో 'బావగారూ బాగున్నారా.. మాత్రమే సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత మరే సినిమా ఆ బ్యానర్‌లో హిట్ కాలేదు. ఇక నాగబాబు నిర్మాతగా మారిన సినిమాల ప్రొడక్షన్ బాధ్యతలను కూడా అల్లు అరవింద్ చూసుకునేవారట.
ఇక అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌ను చిరంజీవిని ప్రత్యేకంగా చూడలేము. ఒక రకంగా మెగాస్టార్‌కు ఇది మరో ఓన్ బ్యానర్ అనే చెప్పాలి. ఇందులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు చిరు. అందులో పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఉన్నాయి. చివరగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చిరంజీవి .. అందరివాడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత రాజకీయాల్లో వెళ్లి బిజీ అయిపోవడం.. ఆ తర్వాత తనే కుమారుడు రామ్ చరణ్ చేత కొణిదెల ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయించి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అటు వేరే బ్యానర్‌లో కూడా సినిమా చేస్తున్నా.. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్‌లో మాత్రం ఏ సినిమా చేయలేదు. త్వరలో చేస్తారన్న గ్యారంటీ లేదు.
మరోవైపు అల్లు అరవింద్.. చిరు ప్రత్యర్ధి హీరో అయిన బాలకృష్ణతో అన్‌స్టాపబుల్ షో చేస్తున్నారు. దాంతో పాటు బాలయ్య, బోయపాటి శ్రీనుతో అఖండ 2 ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆ సంగతి పక్కన పెడితే.. చిరంజీవి.. తన ఓన్ బ్యానర్ అయినటు వంటి గీతా ఆర్ట్స్‌లో నెక్ట్స్ సినిమా చేస్తే చూడాలనుకునే అభిమానులున్నారు. మరోవైపు అల్లు అరవింద్ కూడా చిరుతో సినిమా అంటే అల్లాటప్పా కాదు.. మంచి కథ, కథనంతో పాటు దర్శకుడు సెట్ అయితే కానీ వీళ్ల కాంబోలో సినిమా పట్టాలెక్కిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక అల్లు అరవింద్ మంచి కథ దొరికితే.. తన కుమారుడు అల్లు అర్జున్‌తో చేస్తాడు కానీ.. చిరుతో ఎందుకు చేస్తాడనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి.. వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇదీ చదవండి: వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 7 ఫోటోస్ మీకోసం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook