FNCC donation for flood victims: ఈనెల మొదట్లో.. రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో పలు ప్రాంతాలలో వరదల కారణంగా చాలామంది ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. విజయవాడలోని బుడమేరు పొంగడంతో కూడా భారీ నష్టాలు వాటిల్లాయి. ఈ నేపథ్యంలో చాలామంది రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, మామూలు ప్రజలు కూడా వరద బాధితుల సహాయార్థం విరాళాలు ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే ఎఫ్ ఎన్ సి సి తరఫున ప్రెసిడెంట్ జి ఆదిశేషగిరిరావు, సెక్రెటరీ మోహన్ ముళ్ళపూడి, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. చర్చల అనంతరం వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధి కి 25 లక్షల విరాళాన్ని కూడా అందచేశారు.
ప్రెసిడెంట్ జి ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా ఎఫ్ ఎన్ సి సి క్లబ్ సహాయ కార్యక్రమాలలో ఎప్పుడూ ముందే వుంటుంది అని తెలియజేశారు. ఈ సందర్భంగా సెక్రెటరీ మోహన్ ముళ్ళపూడి గారు మాట్లాడుతూ.. గతంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో విపత్తులు వచ్చినప్పుడు తమ తరపున సహాయం అందింది అని.. ఇప్పుడు కూడా సహాయం చేయడానికి ముందు ఉంటాం అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మాత్రమే కాకుండా.. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసి.. 25 లక్షల చెక్కును విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఫిలింనగర్ క్లబ్ కి అండగా ఉంటున్నారు అని.. కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.
ఇక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా.. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ సభ్యులకు.. కృతజ్ఞతలు చెబుతూ అభినందనలు కురిపించారు.
Read more: Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.